తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు.
పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే టిడిపి అధినేత చంద్రబాబు అని గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. చర్చకు మంత్రి రోజా సిద్ధమా అన్నారు. లోకేష్ అధికారం కోసం పాదయాత్ర చేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారని, మరి అప్పుడు జగన్ అడుక్కు తినడానికి పాదయాత్ర చేశారా అని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన వాళ్ళు మన రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారన్నారు.