SKLM: మున్సిపాలిటీ అభివృద్ధి తన ధ్యాయమని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలాస ఎమ్మెల్యే శిరీష హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు గారు, మున్సిపల్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.