నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో టీడీపీ కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని అయినా పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. మరోపక్క నిబంధనల ప్రకారం పోలీసులకు పలు లేఖలు రాసింది అనుమతి కోరుతూ.ఈక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీనుంచి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఇక నిర్ణయించిన ముహూర్తానికే పాదయాత్ర ప్రారంభకానుంది.