వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల పాదయాత్ర మళ్లీ స్టార్ట్ అవుతోంది. వరంగల్ ఘటనతో తెలంగాణలో ఆమె చేపడుతున్న పాదయాత్ర ఆగిపోయింది. షర్మిల కాన్వాయ్ పై దాడి చేయడం, ఆ కారుతోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లడం, అక్కడ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం, స్టేషన్ కు తీసుకెళ్లడం, వంటివి చకచకగా జరిగిపోయాయి. ఈ క్రమంలో పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వలేదు. అయితే తాజాగా.. ఈనెల 28 నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతుందోదని షర్మిల వెల్లడించారు. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో..అక్కడి నుంచే మొదలు అవుతుందని చెప్పారు. షర్మిల పాదయాత్ర.. బీఆర్ఎస్ పాలనకు అంతిమయాత్ర అని ఆమె ఫైర్ అయ్యారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర స్టార్ట్ అవుతుందని తెలిపారు. ముందస్తు ఎన్నికలు రావని కేసీఆర్ కు ఆ ఆలోచన లేదని ఆమె చెప్పారు.