సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ ప్రీమియం లిక్కర్, లేదంటే చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పోలీసులకు సందేహాం కలిగి, పలు సందర్భాల్లో చెక్ చేస్తుంటారు. ఈ రోజు కడప జిల్లా ఖాజీపేట వద్ద తనిఖీ చేపట్టారు. కర్ణాటకకు చెందిన మద్యం భారీగా పట్టుబడింది. వైసీపీ నాయకుడి కారులో మద్యం దొరకడం విశేషం. బి.మఠం మండలానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ శివరామకృష్ణ కారులో మద్యం లభించింది. 50 కేసుల కర్ణాటక మద్యాన్ని టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివరామకృష్ణ దంపతులను ఎస్పీ కార్యాలయానికి పోలీసులు తీసుకెళ్లారు. ఆ మద్యం విలువ 20 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు.