»Dont Collect Toll If The Roads Are Not Good Nitin Gadkari
Nitin Gadkari: రోడ్లు సరిగా లేకుంటే టోల్ వసూళ్లు చేయొద్దు
రోడ్లు సరిగా మెయింటైన్ చేయలేనప్పుడు టోల్ వసుళ్లు చేయకండి అని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు ఉండడం అంత మంచిది కాదని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Nitin Gadkari: టోల్ ఫీజులపై కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితినక గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లు సరిగా లేనప్పుడు టోల్ వసూళ్లు చేయకండి అని జాతీయ రహదారులను నిర్మించే సంస్థలకు తెలియజేశారు. టోల్ ప్లాజాల వద్ద లైన్లలో చాలా సమయం వాహనాలు నిలిచి ఉండడం అంత మంచి పరిణామం కాదని వెల్లడించారు. శాటిలైట్ ఆధారిత వసూళ్లు కోసం నిర్వహించిన గ్లోబల్ సమావేశంలో మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై అక్కడక్కడ గుంతలు ఉన్నాయని, వాటిని వెంటనే పూడ్చాలని అన్నారు. రోడ్లు అన్ని విధాలుగా బాగుంటేనే టోల్ ఫీజులు వసూళ్లు చేయండి లేదంటే దేశ రాజీకీయ నాయకులైన తమను ప్రజలు విమర్శిస్తారని వెల్లడించారు. అలాగే టోల్ గేట్ల వద్ద కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టకుండా వెంటనే టోల్ కట్టేల ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా శాటిలైట్ ఆధారిత టోల్ వసుళ్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని ఈ సంవత్సరమే ప్రారంభించినట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తొలుత 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్ వసుళ్లను ఏర్పాటు చేస్తారు. హెవీ కమర్షల్ వేహికిల్స్కు టోల్ ప్లజాల వద్ద సపరేట్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెహికిల్ ట్రాకర్ సిస్టం అమలు పరుచాలని తెలిపారు. దీని వలన రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.