Nitin Gadkari: మా కోసం కాదు..దేశం కోసం, పేదల కోసం పనిచేస్తాం
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారంలో పాల్గొన్నారు. దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చే కలను బీజేపీ ప్రభుత్వం సాకాారం చేస్తుందని పేర్కొన్నారు. రైతులు సురక్షితంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అభిప్రాయంవ్యక్తం చేశారు.
Nitin Gadkari: తాము తమ కోసం కాకుండా దేశం కోసం పనిచేసే సేవకులమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పేర్కొన్నారు. ఇండియాను గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చాలన్న కలను బీజేపీ(BJP) ప్రభుత్వం మాత్రమే నెరవేర్చగలదని అన్నారు. రాజస్థాన్( Rajasthan)లోని జోత్వారాలో బీజేపీ అభ్యర్థి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ తరఫున గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రచార సభలో గడ్కరీ(Nitin Gadkari) మాట్లాడారు. దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చాలన్నా.. గ్రామాలు, పేద కూలీలు, రైతుల్లో భయం పోవాలన్నా..ఆకలి, అవినీతి, ఉగ్రవాదం నుంచి విముక్తి లభించాలన్నా అది బీజేపీతో మాత్రమే సాధ్యమన్నారు. భారత్‌ను ప్రపంచలో అగ్రదేశంగా తీర్చిదిద్దాలనేదే తమ లక్ష్యమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే కేవలం బీజేపీ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.
తమ కోసం కాకుండా పేదల కోసం, దేశం కోసం అహర్నిషలు పనిచేస్తామని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అందరూ బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ఎన్నిక కేవలం మీ రాష్ట్రాన్నే కాదు దేశ భవితవ్యాన్నే మార్చేది అని మర్చిపోవద్దు గుర్తు చేశారు. రాబోవు ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందన్నారు. ఎలక్ట్రిక్, ఇథనాల్, హైడ్రోజన్ వాహనాలే ఎక్కువగా కనబడతాయన్నారు. రాజస్థాన్‌లోని రైతులు సుభిక్షింగా ఉండాలన్నా, దేశంలోని రైతులు సుఖంగా నిద్రపోవాలన్నా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని నితిన్ గడ్కరీ ఓటర్లకు సూచించారు.