»Philippines Girl Got Married To The Young Man Of Bundi After Several Years Of Romance
Rajasthan : ఫిలిప్పీన్స్ వధువు, రాజస్థాన్ వరుడు…14 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి
ప్రేమ కోసం మనిషి సప్తసముద్రాలను కూడా దాటుతాడని అంటారు. ఈ సామెత రాజస్థాన్‌లోని బుండిలో నిజమైంది. అక్కడ ఫిలిప్పీన్స్‌కు చెందిన అమ్మాయికి బుండీకి చెందిన యువకుడితో జూన్ 24 న హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది.
Rajasthan : ప్రేమ కోసం మనిషి సప్తసముద్రాలను కూడా దాటుతాడని అంటారు. ఈ సామెత రాజస్థాన్‌లోని బుండిలో నిజమైంది. అక్కడ ఫిలిప్పీన్స్‌కు చెందిన అమ్మాయికి బుండీకి చెందిన యువకుడితో జూన్ 24 న హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది. జూన్ 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పెళ్లి పై చర్చ జరుగుతోంది. ఫిలిప్పీన్స్‌కి చెందిన ఓ అమ్మాయి బుండీకి చెందిన ఓ దుకాణదారుడిని పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చింది. ఆమె వివాహం కోసం తన కుటుంబంతో ఫిలిప్పీన్స్ నుండి వచ్చి బుండీ ముఖేష్‌గా మారిపోయింది.
ఫిలిప్పీన్స్‌కు చెందిన మేరీతో 14 ఏళ్ల క్రితం ఫేస్బుక్లో తనకు స్నేహం ఏర్పడిందని వరుడు ముఖేష్ చెప్పాడు. ఆ తర్వాత స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి దారిలో దేశ సరిహద్దులే అడ్డంకి అయినా పెళ్లికూతురు మేరీ ప్రేమతో ఈ కష్టాలు తీరాయి. ఆమె తన ప్రేమను పొందేందుకు ఫిలిప్పీన్స్ నుండి ఇండియాకు వచ్చింది. మేరీ, ముఖేష్ పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలిచారు. బూండీలో తనకు కిరాణా దుకాణం ఉందని ముఖేష్ చెప్పాడు. కాగా, మేరీ సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది.
14 ఏళ్ల క్రితం తనకు ఫేస్బుక్లో బుండీ నగరంలోని ఉండలియాకు చెందిన డుంగ్రీ దుకాణదారుడు ముఖేష్ శర్మతో పరిచయం ఏర్పడిందని మేరీ తెలిపింది. మొదట చాట్ ద్వారా మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని ఇరువురు కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఇద్దరూ ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు పరిచయం చేసుకున్నారు. టూరిస్ట్ వీసాపై తొలిసారిగా ముంబైకి వచ్చిన మేరీ.. ఆమెను తీసుకెళ్లేందుకు ముకేష్ ముంబై వెళ్లాడు. జూన్ 14న ముఖేష్ మేరీతో కలిసి బూండీలోని తన ఇంటికి వచ్చినప్పుడు, అప్పటికే కాలనీ ప్రజలు డప్పులతో స్వాగతం పలికారు. ఆ తర్వాత పెళ్లికి సన్నాహాలు మొదలయ్యాయి.
ఓ విదేశీ యువతి పెళ్లి చేసుకోవడానికి బండికి వస్తోందన్న వార్త సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ కావడంతో.. పోలీసులు వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. దీని తర్వాత, మేరీ ముఖేష్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ధృవీకరణ కోసం అవసరమైన పత్రాలను అందజేశారు. దీంతో పోలీసులు ఇద్దరి పత్రాలను పరిశీలించి వివాహానికి అనుమతి ఇచ్చారు. ఫిలిప్పీన్స్ వధువును చూసి ముఖేష్ కుటుంబీకులు, కాలనీ వాసులు చాలా సంతోషించారు. శుభ ముహూర్తాన్ని చూసి కుటుంబ సభ్యులు జూన్ 24న వారిద్దరికీ పెళ్లి చేశారు. విశేషమేమిటంటే హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి మొత్తం పూర్తయింది. పెళ్లికి సమీపంలోని ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పెళ్లిలో అందరూ చాలా డ్యాన్స్‌లు, పాటలు పాడారు. ఈ పెళ్లితో వధూవరుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి.