ప్రేమ ఎప్పుడు, ఎవరికి ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరూ ఊహించలేరు కూడా. ప్రేమను కులం, మతం అనే తేడా ఉండదు. అంతేకాదు… ప్రేమించిన వారిని దక్కించుకోవడానికి దేశాలు దాటినవారు కూడా ఉన్నారు. ఈ కథ కూడా అలాంటి కథే. ఓ మహిళ.. తాను కోరుకున్న యువకుడి కోసం.. దేశాలు దాటి వెళ్లింది. అయితే.. ఇక్కడ వారి వయసు మధ్య తేడా 50ఏళ్లకు పైగా ఉండటం గమనార్హం. 83 ఏళ్ల పోలిష్ మహిళ… 28 ఏళ్ల పాకిస్థాన్ వ్యక్తిని ప్రేమించింది. అతని కోసం ఏకంగా దేశాలు దాటి మరీ వచ్చి పెళ్లి చేసుకుంది. పైగా కుటుంబాల అంగీకారంతో వారిద్దరూ ఒక్కటయ్యారు.
83ఏళ్ల వయసు ఉన్న ఆ బామ్మ పేరు బ్రోమా. పోలాండ్‌కు చెందిన ఈమె.. పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ నదీమ్ అనే 28ఏళ్ల యువకుడిని ఇష్టపడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో ఇద్దరూ గత ఏడాది నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఆరేళ్ల క్రితం ఇద్దరికి ఫేస్బుక్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లి ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగింది. బ్రోమా ఎరుపు సంప్రదాయ దుస్తులు ధరించి… చేతికి గోరింటాకు పెట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబైంది. అంతేకాదు ఇస్లామిక్ ఆచారాల ప్రకారం అమ్మాయికి కచ్చితంగా చెల్లించాల్సిన హక్ మెహర్‌ను చెల్లించాడు. భిన్న సంస్కృతులు, వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా బ్రోమాతో సంబంధం లేకపోతే నదీమ్ తన బంధువుల్లో ఒకరిని పెళ్లి చేసుకుని ఉండాల్సిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.