తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. కొత్త సచివాలయ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పొగమంచులో సచివాలయ వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. మంచులో సచివాలయం తాజ్ మహల్‌ను తలపిస్తోంది. దీంతో పలువురు లైక్, చేసి కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. సచివాలయం, తాజ్ మహల్‌ను పోలి ఉందని రాస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీరు కూడా.. ఇదీ సచివాలయమేనా.. లేదంటే ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ అనే సందేహాం వస్తోంది.
సచివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. చిన్న చితకా పనులను పూర్తి చేస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17 ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య ప్రారంభం జరగనుంది. ఆ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు కావడం విశేషం. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు.
Telangana Secretariat getting ready for inauguration on Feb 17th.
సచివాలయ ప్రారంభోత్సవానికి.. తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్‌సోరెన్, బీహార్ సీఎం ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది. కాగా సచివాలయ నిర్మాణ వ్యయం పెరిగింది. తొలుత రూ.400 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం అనుకుంది. టెండర్ల సమయానికి అది రూ.619 కోట్లకు చేరింది. ధరలు పెరిగాయని రూ.800 కోట్లకు పెంచారు. నిర్మాణ పనులు పూర్తయ్యేసరికి రూ.1350 కోట్ల మేర నిధులు ఖర్చవచ్చని అధికారులు అంచనా వేశారు.
The New Telangana Secretariat with its architectural design & grandeur taps appreciation of Architects Nationally & Globally