30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.
18 ycp mlc candidates:ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. స్థానిక సంస్థలు, గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటా.. ఇలా మొత్తం 18 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.
శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ కుంభకోణం బయటకు రావడంతో బీజేపీ నిరాశకు గురవుతోంది. వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ఈడీ సోదాలు చేపట్టింది. పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్న సమయాన దాడులు జరిగాయి. అయితే ఇవేవీ మమ్మల్ని అడ్డుకోలేవు’ అని పేర్కొన్నారు.
నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు.
ఈ ప్రాంతం మాత్రం వైఎస్ కుటుంబానికి మాత్రం అచ్చి రాలేదు. ఆ ప్రాంతంలో ఆ కుటుంబానికి మానుకోట ప్రజలు చుక్కలు చూపించారు. వైఎస్ కుటుంబం (YS Family)లోని వారికి మానుకోట ప్రజల రాళ్ల దెబ్బలు తప్పడం లేదు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి.. నేడు ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila)కు కూడా మానుకోట ప్రజల నుంచి పరాభవం ఎదురైంది.
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది
అసలు గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలకు కౌశిక్ రెడ్డినే కారణం. కౌశిక్ రెడ్డితోనే గవర్నర్, ప్రభుత్వం మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. కౌశిక్ రెడ్డిని సామాజిక సేవ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ కు కోరారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ కు అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్ తమిళిసైకు పంపించారు. ప్రభుత్వ తీర్మానాన్ని గవర్నర్ కొన్నాళ్లు అంటిపెట్టుకున్నారు. ఎంతకీ స్...
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి తారకరత్న చివరి ప్రసంగం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. గత నెల 27వా తేదీన తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు తారకరత్న. ఆ సమయంలో అస్వస్థత ఏర్పడి హాస్పిటల్ కు తరలించారు. విషమంగా ఉండడంతో అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల చికిత్స అనంతరం ఆయన కన్నుమూశారు. అయితే ఆయన చివరి ప్రసంగం ఇప్పుడు వైరల్ గా మారింది. మన...
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.
వైఎస్ఆర్‌టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.