»What Happened To Shiv Sena Can Happen To You Too Uddhav
Maharashtra: చూశారుగా.. పార్టీలకు ఉద్దవ్ హెచ్చరిక
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు - బాణం గుర్తును కేటాయించింది
పార్టీ సింబల్ విషయంలో తమకు ఏం జరిగిందో అన్ని పార్టీలు చుసాయని, ఇప్పటికైనా బీజేపీతో కలవాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచింది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం అసలైన శివసేన గా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఆ వర్గానికి పార్టీ సింబల్ విల్లు – బాణం గుర్తును కేటాయించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ స్పందించారు. అతని మాటలు వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయి. తన తండ్రి నుండి తనకు రావాల్సిన దానిని ఆక్రమించుకున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకు న తండ్రి ముఖం కావాలి తప్ప.. ఆయన కుమారుడిని అయిన నేను వద్దా అని బిజెపి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేను మీతో కలిసి నడిచేందుకు సిద్దం అయ్యానని, కానీ నా తండ్రికి ఇచ్చిన హామీని నేను నేరవేర్చడానికి సిద్ధమైన తరుణంలో మీరే నన్ను వదిలేశారని అలా అయితే నేనేం చేయగలను అని ప్రశ్నించారు.
తాను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని కావాలని కోరుకోలేదు అన్నారు. కానీ కాంగ్రెస్, ఎన్సిపీలు తనను సీఎం పదవి చేపట్టామని చెప్పారని, లేదంటే ప్రభుత్వం ఏర్పాటు కాదు అని చెప్పారని దీంతో తను ఆ పదవి చేపట్టవలసి వచ్చింది అన్నారు. శివ సేన, బీజేపీలు చేరి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని చెప్పిన హామీని కమలం పార్టీ విస్మరించింది అన్నారు. మా పేరు నుండి కొంతమంది ఫిరాయించారు అని.. వారు వెళ్ళలనుకంటే వెళ్ళవచ్చు అని, కానీ నన్ను బయటకు పంపించి ఇంటిని స్వాధీనం చేసుకుంటాను అంటే ఇక అని ప్రశ్నించారు. తద్వారా తండ్రి పెట్టిన శివ సేన పార్టీ వారసత్వంగా తనదే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారంతా యజమానులు అనుకుంటున్నారు అని, వ్యవస్థలు అలాంటి ఇంటి దొంగలను యజమానులుగా చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జరిగింది మంచికే అని, బిజెపి గురించి అందరికీ తెలిసింది అని, ప్రజలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తాను బిజెపిని వదిలిపెట్టాను తప్పితే హిందుత్వను కాదని నమ్మబలికారు. ప్రజలను విభజించే హిందుత్వను తాను నమ్మనని కొత్త మాటలు చెప్పారు.
హిందువులను బిజెపి తప్పుదోవ పట్టిస్తుంది అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో గోవధ, హిజాబ్ వంటి అంశాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అన్నారు. దేశం శక్తిమంతమైన నేత చేతికి ఉంటే హిందువులు ఎందుకు ఆక్రోశంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. మనం బలమైన దేశం కోసం నేతకు ఓటు వేస్తే ఆయన మాత్రం బలమైన నాయకుడిగా మారాడు అన్నారు. దేశం మాత్రం బలపడలేదు అన్నారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి పార్టీని, గుర్తును కేటాయించడం సారీ కాదు అన్నారు. శివసేన ఎప్పుడు ఉత్తర భారతీయులు, ముస్లింలకు వ్యతిరేకం కదూ అన్నారు. ఎన్నికల కమిషన్ పార్టీ గుర్తును షిండేకు కేటాయించడంతో విలన్ సంతోషంగా ఉన్నాడని అమిత్ షాను ఉద్దేశించి అన్నారు.