»Ys Sharmila Said Mla Shankar Naik Has Grabbed 2100 Acres
YS Sharmila: ఎమ్మెల్యే శంకర్ నాయక్ 2,100 ఎకరాలు కబ్జా చేశారు
తెలంగాణలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి కబ్జా అంశంపై ఏ పార్టీ నేతలు కూడా ప్రశ్నించలేదని..కానీ తాను అడిగినందుకు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
మహబూబాబాద్(Mahabubabad) ఎమ్మెల్యే(mla) శంకర్‌నాయక్(Shankar Naik) 2,170 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 2,100 ఎకరాలు కబ్జా చేశారని వైఎస్సార్సీపీ(ysrtp) అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) వ్యాఖ్యానించారు. కబ్జా వ్యవహారం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అవునో కాదో తెలియాలంటే ఇదే నియోజకవర్గంలో పబ్లిక్ ఫోరం పెట్టాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా భూములు కబ్జా చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఒక మహిళ వచ్చి అతని అవినీతి గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేకనే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి..తనను అడ్డుకుంటున్నారని వెల్లడించారు. ఇతని ఆగడాల గురించి కాంగ్రెస్(congress), బీజేపీ(bjp) పార్టీలు ఇన్ని రోజులుగా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
మహబూబాబాద్ నియోజకవర్గం(Mahabubabad constituency)లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర దాటిన తర్వాత అధికార ప్రభుత్వం అనేక చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని షర్మిల(Sharmila) మండిపడ్డారు. మరోవైపు శంకర్ నాయక్ ఆగడాలను ప్రజలందరూ చూడాలని వీడియోలను ప్రదర్శించారు. ఇంత అవినీతికి పాల్పడుతున్నా కూడా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు తనపై జరిగిన దాడి అంశాన్ని గవర్నర్ తమిళిసైకి(governor tamilisai) ఫిర్యాదు చేస్తానని షర్మిల స్పష్టం చేశారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్(Shankar Naik)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో షర్మిలపై కేసు నమోదైన నేపథ్యంలో ఆమె అరెస్ట్ అయింది. 504 IPC, 3(1)r SC ST POA చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహబూబాబాద్‌లో భారతీయ రాష్ట్ర సమితి (BRS) మద్దతుదారులు ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు చేయడంతో శాంతిభద్రతలను నివారించడానికి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
మరోవైపు తెలంగాణ(telangana)లో కేసీఆర్(kcr) పాలనను ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబాన్ల పాలనతో పోల్చారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఆయన ఓక “నిరంకుశుడు” అని అభివర్ణించారు. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, కలవరపడిన షర్మిల.. కేసీఆర్ “ప్రజాస్వామ్య భాష”ను అర్థం చేలుకోలేరని ఆరోపించారు. తెలంగాణలో మహిళలకు మాట్లాడే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళల(womens)కు గౌరవం లేదని మహిళందరూ ఒక్కటై సీఎం కేసీఆర్(kcr)ను ఓడించాలని షర్మిల కోరారు.