»Laxmi Parvathi Shocking Comments On Tarakaratna Death
Laxmi Parvathi: తారకరత్న మరణం ఇన్నాళ్లు దాచిపెట్టారు
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు.
నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు తారకరత్న మృతి పైన వైసీపీ నేత నందమూరి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇన్నాళ్లు ఆయన మృతిని దాచి పెట్టారు అని సంచలన ఆరోపణ చేశారు. పాపం ఆ అబ్బాయి ఎప్పుడో చనిపోయాడని, దారుణంగా ఇన్నాళ్లు దాచిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబంలో జరిగిన బాధాకరమైన సంఘటన అన్నారు. ఇదేం రాజకీయం.. నా భర్తను వేధించారు.. ఇప్పుడు ఈ అబ్బాయిని చనిపోయిన చెప్పలేదు. తన స్వార్థం కోసం ఆలస్యం చేశారు అన్నారు. వాళ్ళు చెప్పక పోయినప్పటికీ గుండె ఆగింది అన్నప్పుడే చనిపోయాడని అందరికీ అర్థం అయ్యింది అన్నారు. తన కొడుకు కోసం.. స్వార్థం కోసం.. ఎక్కడ తన కొడుక్కి చెడ్డ పేరు వస్తుంది అనే భయంతో.. తండ్రి కొడుకు అంటే అపశకునం అవుతుందనే చెప్పలేదు అన్నారు. కానీ వారు తెలుసుకోవాల్సింది ఏమంటే… బాబు.. లోకేష్ అంటే అపశకునమని ప్రజలకు తెలుసు అన్నారు. రాజకీయం కోసం ఇలా చేయడం దారుణమని, తారకరత్న చాలా మంచి పిల్లాడు అన్నారు.
కాగా..ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న ఆయన శివరాత్రి పర్వదినం రోజున శివైక్యం చెందారు. జనవరి 26వ తేదీన తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండెనొప్పి వచ్చి కుప్ప కూలాడు. అతనిని కుప్పంలో హాస్పిటల్ లో చేర్పించారు. అనంతరం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్ను మూశారు. ఆయన పరిస్థితి ఉదయం నుండే అత్యంత విషమం అని వార్తలు వచ్చాయి. రాత్రికి మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, ఓ కూతురు ఉన్నారు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఒకటో నెంబర్ కుర్రాడుతో ఎంట్రీ ఇచ్చారు. ఒకేసారి 9 సినిమాలు ప్రారంభించి రికార్డ్ సృష్టించారు. తారకరత్న హీరోగా దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడిగా కూడా కనిపించారు. 2009లో విడుదల అయిన అమరావతి సినిమాలో ఆయన నటనకు గాను ఉత్తమ విలన్గా నంది అవార్డు వచ్చింది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. 9 అవర్స్ వెబ్ సిరీస్లో నటించారు. చివరిగా సారధి సినిమాలో నటించారు.