వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
వైఎస్ఆర్టీపీ(YSRTP) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ షర్మిల(YS Sharmila) చేపడుతున్న పాదయాత్రను రద్దు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని, అందుకే పాదయాత్రకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని బేతోలులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పాదయాత్ర చేపడుతున్నారు. ఆ పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. షర్మిల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైఎస్సార్టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్చి 5వ తేదీన పాలేరులో వైఎస్ షర్మిల(YS Sharmila) పాదయాత్ర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవలె నర్సన్నపేటలో పెద్ది సుదర్శనరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అరెస్టు చేసి ఆమెను హైదరాబాద్ కు తరలించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె బస్సును సైతం తగులబెట్టారు. తాజాగా మరోసారి వైఎస్ షర్మిల శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. అందుకే షర్మిలను అదుపులోకి తీసున్నట్లు తెలిపారు.
పాదయాత్రలో వైఎస్ షర్మిల(YS Sharmila) మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కబ్జా కోర్ శంకర్ నాయక్ సైగ చేస్తే పాదయాత్రపై ఆయన గూండాలు దాడి చేస్తారట. శంకర్ నాయక్‌కు సవాల్ చేస్తున్నా.. నీకు దమ్ముంటే పాదయాత్రపై దాడి చెయ్. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు వైయస్ఆర్ బిడ్డ. మీరు చేసిన మోసాలపై, అక్రమాలపై బరాబర్ ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మమ్మల్ని తిడతాడట. మహిళను పట్టుకొని తిడితే ప్రజలే తరిమికొడతారు.. ఖబడ్దార్!’ అంటూ షర్మిల(YS Sharmila) హెచ్చరించారు. ఈ నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతల సమస్య ఏర్పడిందని, అందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.