కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయపూర్‌లో మూడు రోజులపాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించే అవకాశముంది. 2024 ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యంగా ముందుకు సాగనుంది. ఈ ప్లీనరీలో దేశవ్యాప్తంగా పాల్గొననున్న 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ప్లీనరీ చివరి రోజు.. ఫిబ్రవరి 26వ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విపక్షాల ఐక్యత, ఇందులో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పైన చర్చించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలని విషయం చర్చించనుంది. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ లో ఉత్సాహం ఉందని, అదే దూకుడుతో విపక్షాలను ఏకతాటి పైకి తీసుకు రావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడగా.. దీనిని కాంగ్రెస్ స్వాగతించింది.