»Yuvagalam Padayatra Break Due To Taraka Ratna Demised
Yuvagalam పాదయాత్రకు బ్రేక్.. హైదరాబాద్ కు లోకేశ్
తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.
తన సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం (Telugu Desam Party) పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విరామం ప్రకటించాడు. తన బంధువు, నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) తుదిశ్వాస విడవడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. బెంగళూరు (Bengaluru)లోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya Hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న లోకేశ్ పాదయాత్రను విరమించుకున్నాడు. తారకరత్న కోసం హైదరాబాద్ (Hyderabad)కు పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో కొనసాగాల్సిన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం పడింది.
జనవరి 27న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam)లో యువగళం (Yuvagalam) పేరిట లోకేశ్ పాదయాత్ర ప్రారంభించాడు. పాదయాత్ర కోసం రెండు రోజులుగా తారకరత్న కుప్పంలోనే ఉన్నాడు. పాదయాత్రను బాలకృష్ణతో కలిసి తారకరత్న ప్రారంభించాడు. అయితే కొద్దిసేపటికి ప్రజల రద్దీని తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అటు నుంచి బెంగళూరుకు తరలించారు. 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూయడంతో లోకేశ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే పాదయాత్రను విరమించుకుని హైదరాబాద్ కు ప్రయాణమయ్యాడు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే తారకరత్న మరణంతో లోకేశ్ కలత చెందాడు. బావా అంటూ ఆప్యాయంగా పిలిచే తారకరత్న గొంతు ఇక వినిపించదన్న విషయం తనకు బాధగా ఉందని లోకేశ్ తెలిపాడు.
‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అని లోకేశ్ ట్వీట్ (Tweet) చేశాడు.
హైదరాబాద్ శివారులోని మోకిల (Mokila)లోని తారకరత్న నివాసంలో పార్థీవదేహం ఉంచారు. హైదరాబాద్ చేరుకున్న లోకేశ్ తారకరత్న నివాసానికి వెళ్లి నివాళులర్పించనున్నాడు. ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఓదార్చనున్నాడు. కుటుంబసభ్యులకు ధైర్యం ఇవ్వనున్నాడు. అయితే తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా విషాదంలో మునిగారు. తారకరత్నను పరామర్శించేందుకు హైదరాబాద్ కు తరలివస్తున్నారు. కాగా తారకరత్న కన్నుమూయడంతో సినీ పరిశ్రమ (Tollywood)లోనూ విషాదం అలుముకుంది. సినీ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు తారకరత్న మృతికి సంతాపం ప్రకటించారు.
రేపు సోమవారం ఫిలించాంబర్ లో తారకరత్న మృతదేహాన్ని సందర్శకుల కోసం ఉంచనున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి రానున్నారు. తారకరత్నకు నివాళులర్పించనున్నారు. రేపు సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహా ప్రస్థానం (Maha Prasthanam) శ్మశాన వాటికలో జరగనున్నాయని కుటుంబసభ్యులు ప్రకటించారు.
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G