తెలంగాణ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి తెలంగాణలో రాష్టపతి పాలన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి అసెంబ్లీ రద్దు కావొచ్చునని, రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచనలో ఉందని చెప్పారు.
తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని చెప్పారు. బిజెపి మతపరంగా దేశాన్ని విడదీస్తోందని అన్నారు. దళిత బందు, ఇసుక, మట్టి, మద్యం సిండికేట్ లో కోదాడ ఎమ్మెల్యే కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీ ఖాయమని చెప్పారు.