TG: BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో తన కార్యాలయంపై, నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు. తమ ఓపిక నశించితే రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతాయని హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పని చేస్తున్నారని విమర్శించారు.