మదర్సాల విషయంలో NCPCR సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మదర్సాల్లో విద్యాహక్కు చట్టాన్ని పాటించట్లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) పేర్కొన్నారు. అందుకే మదర్సాలు, మదర్సా బోర్డులకు నిధులు ఇవ్వొద్దని రాష్ట్రాలకు సిఫార్సు చేసింది. మదర్సాల్లో చదువుతున్న పిల్లలను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించింది. కాగా, ఈ సిఫార్సులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.