AP: మంత్రులు నారాలోకేశ్, సత్యకుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంత్రి సత్యకుమార్ మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నారు. 3 నెలల పాలన, 3 పార్టీల సమన్వయం, కేంద్ర పథకాల అమలు అంశాలపై షాకు నివేదిక ఇవ్వనున్నారు. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ నేతలతో ఆయన విడివిడిగా భేటీ అవుతారు. ఆదివారం రాత్రి అమిత్‌షాను లోకేశ్ కలిశారు. 40 నిమిషాల పాటు అనేక అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.