గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున లాయర్ కపిల్ సిబల్ కేసును పాస్ ఓవర్ చేయమని కోరగా.. ధర్మాసనం అంగీకరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా కోరుతూ అభ్యర్థులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా, కాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.