సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే వీడియో తీసి, షేర్ చేసేస్తున్నారు. సినిమా పాటలకు కొందరు ప్రొఫెషనల్స్‌లా డ్యాన్స్ చేస్తారు. ఆ కోవకు చెందుతారు పాకిస్థాన్‌కు చెందిన ఈ అమ్మాయి. బాలీవుడ్ హిట్ సింగ్ ‘అంగ్ లాగా దే’ పాటకు కళ్లు కట్టిపడేసేలా స్టెప్పులు వేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. గోలియోన్ కీ రాస్లీలా రామ్ లీలా మూవీలోనిది పాట. రణవీర్ సింగ్ సరసన దీపికా పదుకొనే నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తన సోదరి పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను యువతి సోదరి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ‘టాలెంట్ ఉన్న తన సోదరి చేసిన డ్యాన్స్ ఇది, డ్యాన్స్ చూసి గర్వపడుతున్నాను. ఆ వీడియోను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా’ అని ఆమె సిస్టర్ క్యాప్షన్ పెట్టారు. వీడియో ఇప్పటికే 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2.2 లక్షల లైకులు కొట్టారు. ఆమె డ్యాన్స్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
https://www.youtube.com/watch?v=OHVbWwE26TY
పాటకు యువతి చక్కగా స్టెప్పులు వేసిందని ఒకరు కామెంట్ చేశారు. ఆమె లెహంగా తనకు ఆందోళన కలిగించిందని రాశారు. పాటకు తగినట్టు స్టెప్పులు వేసిందని మరొకరు అభిప్రాయపడ్డారు. ఆమె కాన్ఫిడెన్స్ చూసి తనకు కూడా డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం వచ్చిందని చెప్పారు. ఆ యువతి చేసిన డ్యాన్స్ యూట్యూబ్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌కు ఏమాత్రం తీసిపోకుండా స్టెప్పులు వేసింది.