బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ అవుతునే ఉన్నారు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఏ మాత్రం అలరించలేకపోవడంతో.. ప్రభాస్ కొత్త సినిమాల కోసం వెయ్యి కళ్ళతో చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయదా పడుతు వస్తున్న ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి పోస్ట్ పోన్ అవనున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ‘ఆదిపురుష్’ టీజర్ పెద్దగా ఆకట్టుకోలేదు. గ్రాఫిక్స్ పరంగా ఏ మాత్రం మెప్పించలేకపోయారని.. దర్శకుడు ఓం రౌత్ పై మండి పడ్డారు. ఈ నేపథ్యంలో.. గ్రాఫిక్స్ వర్క్‌పై ఓం రౌత్ మరింత కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి చాలా సమయ్ం పట్టేలా ఉందని అంటున్నారు. అందుకే ఆదిపురుష్‌ని వాయిదా వేసారని.. రేపో మాపో అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే మరో వెర్షన్ ప్రకారం.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహా రెడ్డి’,’వారసుడు’, ‘ఏజెంట్’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే అజిత్ ‘తునివు’ కూడా రాబోతోంది. ఈ సమయంలో ప్రభాస్ సినిమా పోటీలో ఉంటే కలెక్షన్లు తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే ‘ఆదిపురుష్’ వాయిదా పడుతోందని టాక్. ఇన్ని సినిమాల మధ్య వస్తే.. ఆదిపురుష్ ఓపెనింగ్స్ పై ప్రభావం పడక తప్పదు. కాబట్టి సోలోగా రావాలనే ఆలోచనతోనే.. 2023 సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదనే చెప్పాలి.