NGKL: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్‌లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిందని అన్నారు.
SDPT: జిల్లా కలెక్టరేట్లో సెన్సస్-2027 ప్రక్రియపై తహశీల్దార్లు, ఎంపీడీవోలకు నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. జనాభా గణన ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశాభివృద్ధి ప్రణాళికలకు జనగణన కీలకమని, క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
GDWL:వడ్డేపల్లి మండలం పైపాడులో బుధవారం పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రెండో రోజు పశువులకు గాలి కుంటూ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ స్వరూపరాణి సూచించారు. టీకాల వల్ల పశువులకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అవి ఆరోగ్యంగా ఉంటాయని ఆమె తెలిపారు.
SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో సర్పంచ్ కాత మల్లేశం పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉపసర్పంచ్ కోదాని మహేష్, ప్రధానోపాధ్యాయురాలు రేవతి దేవి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో విలువలతో కూడిన విద్య విజయభారతి పాఠశాలలోనే అందుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. బుధవారం జరిగిన స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ముచ్చటించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయభారతి విద్యార్థులు ర్యాంకులు సాధిస్తూ ముందంజలో ఉన్నారని తెలిపారు.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. T20 WCలో అద్భుత ప్రదర్శన కనబరచడంతో, ఇషాన్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని నెం.2కు చేరుకున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ 875 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్, ఇషాన్‌ల మధ్య 4 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. కాగా, ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా SRH సభ్యులే కావడం విశేషం.
SRD: ఖేడ్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. ఈ మేరకు ఈరోజు హైదరాబాదులో సమావేశమై, ఎమ్మెల్యే వినతి పత్రాన్ని సమర్పించారు. ఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసే దిశగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
MBNR: దేవరకద్ర మండలం నాగారం స్టేజీ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సంతలో గొర్రెలు అమ్మి తిరిగి వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో బాధితులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు.
NLG: చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ పాల్గొని పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వాటర్ ట్యాంకులను, మురికి కాలువలను శుభ్రపరచారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో తన వంతుగా ఎప్పుడా ముందుంటానని పేర్కొన్నారు.
VZM: ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆదేశాలతో టీడీపీ ముఖ్య నాయకులు విజయనగరం 43వ డివిజన్లో కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నూతనంగా నియమించిన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. అలాగే, సోషల్ మీడియాలో కూడా క్రియాశీలకంగా ఉండాలన్నారు.
NZB: నిజామాబాద్ నగర నడిబొడ్డున గల రాజీవ్ గాంధీ ఆడిటోరియం, న్యూ అంబేద్కర్ భవన్‌లను ఇవాళ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆడిటోరియం హాల్, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆడిటోరియంను ఆధునికీకరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేంద్రప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు ఎస్ నాగేశ్వర్ రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. తిరువూరు సీపీఎం పట్టణ కమిటీ అధ్యర్యంలో బోసుబొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. యుద్ధం వలన ఆస్తి, ప్రాణ నష్టం కాకుండా అన్నిదేశాలు సంక్షోభంలో కూరుకు పోతాయన్నారు.
T20 WC గెలవడంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాత్ర అత్యంత కీలకం. జట్టు ఎంపిక విషయంలో కోచ్ గంభీర్‌తో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, అగార్కర్ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. గిల్‌ను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినప్పటికీ, అగార్కర్ మాత్రం ఇషాన్ కిషన్, రింకూ వైపు మొగ్గు చూపాడు. అగార్కర్ తీసుకున్న ఈ నిర్ణయమే WCలో భారత్ విజేతగా నిలవడానికి ప్రధాన కారణమైంది.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినీ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పెద్ద దిక్కులు, పదవులు ఉండవని పేర్కొన్నారు. ఎవరికి వాళ్లు చేసే పనులను బట్టి పెద్ద దిక్కవుతారని స్పష్టం చేశారు. ఇది వరకు ఒకరు చేశారని, ఆయన చేసిన పనుల వల్లే పెద్ద దిక్కయ్యారని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లేనని అన్నారు. ఇకపై ఇంకొకరు రారు అంటూ తెల్చి చెప్పారు.