• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు బాలికలకు HPV టీకా కార్యక్రమం

KDP: లింగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం ఆయన తెలుపుతూ.. బాలికలకు ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ నివారించడం జరుగుతుందన్నారు. కావున బాలికల తల్లిదండ్రులు బాలికలను ప్రోత్సహించి ఈ టీకాలను వేయించాలని కోరారు.

March 12, 2026 / 07:10 AM IST

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 640 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ముగ్గురు చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 34 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు.

March 12, 2026 / 07:09 AM IST

రేపు నగరంలో జాబ్ మేళా

BPT: నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రేపు ఉద్యోగ మేళా ఉంది. దివీస్ ల్యాబ్‌లో పనిచేయడానికి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

March 12, 2026 / 07:08 AM IST

రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

కోనసీమ: రావులపాలెం మండలంలోని ఈతకోట టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులెవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

March 12, 2026 / 07:08 AM IST

బజార్ హత్నూర్‌లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా

ADB: బజార్ హత్నూర్ మండల యువత డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ముందుకు రావాలని ఎస్సై సంజయ్ కుమార్ కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18లోపు పోలీస్ స్టేషన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, టెన్త్ మెమో, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలతో మీ సేవా సెంటర్‌లో స్లాట్ బుక్ చేసి పత్రాలను పోలీస్ స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.

March 12, 2026 / 07:08 AM IST

‘పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుంది’

MBNR: పరస్పర ప్రేమాభిమానాలకు రంజాన్ పండగ ప్రతీకగా నిలుస్తుందని మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన పలు ఇఫ్తార్ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

March 12, 2026 / 07:07 AM IST

గోరక్షాసనం వల్ల కలిగే ఉపయోగాలు

గోరక్షాసనం (కౌహెర్డ్ పోజ్) అనేది యోగాలో ఒక ముఖ్యమైన ఆసనం. ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తోక ఎముక ఫ్లెక్సిబిలిటీని పెంచి, కదలికలను సులభతరం చేస్తుంది. కాళ్ల కండరాలను స్ట్రెచింగ్ చేసి, టోన్ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేస్తుంది. శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను పెంపొందిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది.

March 12, 2026 / 07:05 AM IST

ఆ పాఠశాల ప్రిన్సిపల్‌కు నోటీసులు

WGL: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎం. నర్సయ్య నెలరోజులుగా పాఠాలు చెప్పకపోవడంతో డీఈవో బి. రంగయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎం.నర్సయ్యపై నెలరోజులుగా ఏలాంటి చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మాధవికి కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

March 12, 2026 / 07:05 AM IST

ఎంజీయూలో బీటెక్ విద్యార్థుల ఆందోళన

న‌ల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధ‌వారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఫీజులు అదనంగా రూ.5 వేలు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

కల్వరాల వాసికి జీవిత ఖైదు

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన వడ్డే కురుమయ్యకు పోక్సో (POCSO) కేసులో జిల్లా జడ్జి సునీత జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీసులు దర్యాప్తు చేపట్టి, నేరం నిరూపితం కావడంతో శిక్ష ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

March 12, 2026 / 07:05 AM IST

సీపీఎం పార్టీ సీనియర్ నేత కొండయ్య మృతి

SRPT: మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు ఉయ్యాల కొండయ్య మంగళవారం రాత్రి కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల మునగాల మండల సీపీఎం పార్టీ నాయకులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 07:05 AM IST

YCP తీరు రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకమే: లోకేష్

AP: YCP నేతలు విశాఖలో గూగుల్ AI హబ్ ఏర్పాటును సవాల్ చేస్తూ కోర్టుకెళ్లడం రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకమేనని మంత్రి లోకేష్ మండిపడ్డారు. ఇలా జగన్ మరోసారి తన అభివృద్ధి రాజకీయాలకు తెరలేపారని.. యువత, రాష్ట్ర భవిష్యత్తుపై ఎందుకంత విద్వేషం? అంటూ మాజీ CMను నిలదీశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రాభివృద్ధి ఆగదని స్పష్టంచేశారు.

March 12, 2026 / 07:04 AM IST

‘వాణిజ్య కేంద్రాల్లో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు’

VZM: హోటళ్లు, దాబాలు, వాణిజ్య కేంద్రాల్లో గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాల అధికారి మురళీనాథ్‌ బుధవారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తే 6A కేసులు నమోదు చేస్తామన్నారు. గత ఆరు నెలల్లో 10 కేసులు నమోదు చేసి, 40 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

March 12, 2026 / 07:03 AM IST

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

BHNG: ఆలేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి ఐదు ట్రాక్టర్లను పట్టివేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ పట్టుబడిన ట్రాక్టర్లపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 07:02 AM IST

చేపల వేటకు నేడు బహిరంగ వేలం

ATP: కణేకల్లు మండలం కళేకుర్తి చెరువులో చేపల వేట కోసం నేడు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పీఏబీఆర్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి డి.పెద్దబాబు నాయక్ తెలిపారు. ఉదయం 11:30 గంటలకు స్థానిక సచివాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డుతో పాటు 5 వేల రూపాయలు చెల్లించాలని సూచించారు.

March 12, 2026 / 07:01 AM IST