• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రేపు సర్పంచులకు శిక్షణ తరగతులు’

KMR: నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో సర్పంచులకు రేపు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DPO మురళి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధుల వినియోగం, సర్పంచుల విధులు, బాధ్యతలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

March 11, 2026 / 03:47 PM IST

IPL- 2026: కెప్టెన్ల ఫొటోషూట్ డేట్ ఫిక్స్..?

ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభానికి ముందే అసలైన సందడి మొదలు కానుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 15న ఢిల్లీ వేదికగా అన్ని IPL జట్ల కెప్టెన్లతో కలిసి అధికారిక ఫొటోషూట్ నిర్వహించనున్నారు. పది జట్ల సారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రోఫీతో కలిసి ఫోజులివ్వనున్నారు. అదే రోజున ఢిల్లీలో భారత క్రికెట్ అవార్డుల వేడుక ‘NAMAN’ కూడా జరగనుంది.

March 11, 2026 / 03:47 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే

NZB: TNGOS భవనంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం వివిధశాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో సత్కరించారు.

March 11, 2026 / 03:45 PM IST

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: డీఈఓ

WGL: మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేసే ప్రమాదం ఉందని డీఈఓ రంగయ్య నాయుడు విద్యార్థులకు సూచించారు. బుధవారం ఉర్సుగుట్టలోని తాళ్ల పద్మావతి హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంది విద్యలో రాణించాలని కోరారు.

March 11, 2026 / 03:41 PM IST

ఆర్టీసీ బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

AKP: ఎలమంచిలి ఆర్టీసీ బస్టాండ్‌ను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లను, బస్టాండ్ ఆవరణలో దుకాణాలను పరిశీలించారు. ఎలమంచిలి కాంప్లెక్స్‌లోకి వోల్వో బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే, బస్టాండ్‌ను ఆధునికరించాల్సిన అవసరం ఉందన్నారు.

March 11, 2026 / 03:40 PM IST

సీఎం కాన్ఫరెన్స్‌లో అనంతపురం కలెక్టర్ ఆనంద్

ATP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) లక్ష్యాల సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

March 11, 2026 / 03:40 PM IST

ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్!

రెబల్ స్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీ రాబోతున్నట్లు టాక్. దర్శకుడు సుజీత్ ‘సాహో’, ‘OG’ మూవీలను కలిపి సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తుండటంతో ఈ మల్టీస్టారర్ వార్తలు ఊపందుకున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశం ఉంది. మరి సుజీత్ దర్శకత్వంలోనే ఈ పవర్-రెబల్ కాంబో సెట్ అవుతుందో లేక సరికొత్త దర్శకుడు వస్తాడో చూడాలి.

March 11, 2026 / 03:39 PM IST

‘క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలి’

ADB: విద్యార్థులు క్రమ శిక్షణతో కూడిన విద్యను అభ్య సించాలని 22వ వార్డ్ కౌన్సిలర్ రాకేష్ అన్నారు. హమాలి వాడ MPPS విద్యార్థులకు తాగు నీటి కోసం రిటైర్డ్ PG HM గంగాధర్ రూ. 20 వేల విలువ గల RO వాటర్ ఫిల్టర్ అందజేశారు. కౌన్సిలర్ రాకేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల HM జ్యోష్న, కాంప్లెక్స్ HM లచ్చరాం, MEO సోమయ్య, తదితరులు ఉన్నారు.

March 11, 2026 / 03:37 PM IST

బండ్లగూడెంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

JN: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా లింగాల ఘణపురం మండలం బండ్లగూడెం గ్రామంలో మంచినీటి సరఫరా OHRS ట్యాంక్‌ను సిబ్బంది బుధవారం క్లీనింగ్ & క్లోరినేషన్ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పోరెడ్డి సంతోషి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ గట్టగల్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి సంతోషి పనులను పరిశీలించారు. గ్రామస్తులు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు.

March 11, 2026 / 03:36 PM IST

తల్లిదండ్రుల ఆకాంక్షలను నిలబెట్టాలి: మేయర్

NLR: విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదవాలని నెల్లూరు కార్పొరేషన్ మేయర్ సుజాత సూచించారు. స్టోన్స్ పేట బీవీఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్ బుధవారం అందజేశారు. పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నిలబెట్టాలని కోరారు.

March 11, 2026 / 03:35 PM IST

హాట్ టాపిక్‌గా టీటీడీ ఛైర్మన్ ఫ్లెక్సీలు

CTR: తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ నాయుడు బయటకు రాకుండా దాక్కున్నాడనే వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. టీటీడీ పరిసరాల్లో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది.

March 11, 2026 / 03:34 PM IST

చల్లటి కబురు…ఈ నెల 16 నుంచి వర్షాలు

KMM: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేడు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న ఈ తరుణంలో అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు.

March 11, 2026 / 03:34 PM IST

పెబ్బేరు బైపాస్ లో స్థలం కేటాయించాలని వినతి

WNP: బహుజన ఆరాధ్య దైవం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు బైపాస్ రోడ్డులో స్థలం కేటాయించాలని గౌడ సంఘం నాయకులు మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్‌కు బుధ వారం వినతిపత్రం సమర్పించారు. పాపన్న గౌడ్ స్ఫూర్తిని చాటేలా విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్ గౌడ్, ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

March 11, 2026 / 03:34 PM IST

నేరాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత

TPT: శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను పీఎస్ ఎస్సై, సిబ్బంది సందర్శించారు. ఉద్యోగులకు శక్తి యాప్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని, సమాజంలో నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉండాలని సూచించారు.

March 11, 2026 / 03:34 PM IST

రోజురోజుకు పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు

మంచిర్యాలలో రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 38 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పగలంతా ఎండ తీవ్రత రాత్రి చల్లగా భిన్న వాతావరణం నెలకొంది. దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పగటిపూట ఎండల్లో తిరగవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

March 11, 2026 / 03:32 PM IST