E.G: బీజేపీ ఎస్సీ మోర్చా తూ.గో జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వోబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్య సాయిరాం పారిశుద్ధ్య మహిళా కార్మికులకు చీరలు, మెమెంటోలు పంపిణీ చేశారు. సాయిరాం మాట్లాడుతూ.. కార్మికులుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు పాల్గొన్నారు.
JN: జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులకు అవసరమైన భూ సేకరణకు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆర్అండ్ఆర్ కమీషనర్ కె.శివకుమార్ నాయుడు తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో పాల...
PDPL: జిల్లాలో వేసవికాలం తాగునీటి సమస్య నివారణకు మంత్రి శ్రీధర్ బాబు, తాను నిధులు సమకూరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రజా ప్రతినిధులకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలుపై స్థానిక సంస్థల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
SRCL: రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో కాలేశ్వరం 11వ కాలువ పనులను పూర్తి చేయాలని ధర్నా చేస్తున్న రైతులకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వపరులు పూర్తి చేయాలని నెల రోజులుగా రైతులు నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
JGL: ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి పరీక్షలకు ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్, గోదూర్ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో మధు తెలిపారు. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూరిబాలో కలిపి మొత్తం 304 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
కోనసీమ: అల్లవరం మండలంలో అపరిచిత వ్యక్తులు సంచారం చేస్తున్నారని మండల బీజేపీ అధ్యక్షులు కట్టా నారాయణ మూర్తి సోమవారం గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుకు అధికారులు స్పందించారు. ఈ మేరకు అల్లవరం ఎస్సై సంతోష్ కుమార్ బుధవారం వివరణ ఇస్తూ.. అపరిచిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే తమకు సమాచారం అందించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్యాస్ డీలర్లను బుధవారం ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు ఒకసారిగా నిర్ణయించినట్లు తెలిపారు.
టాలీవుడ్‌లో కులం ప్రభావంపై సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. పరిశ్రమలో కుల పిచ్చి ఉందనే విమర్శలను ఖండించాడు. తన వ్యక్తిగత జీవితాన్నే ఉదాహరణగా చెబుతూ.. ‘నా భార్య చౌదరి, నా అల్లుడు రెడ్డి, నేను కాపు. ఇక్కడ మూవీకి కులం లేదు. సినీ రంగం అనేది భిన్న కులాలు, మతాల కలయిక. ఇక్కడ కేవలం ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది’ అని ఆయన తెలిపాడు.
BPT: బాల్య వివాహాలను నివారించేందుకు ప్రజల్లో అవగాహన పెరగాలని కొల్లూరు అంగన్వాడీ సూపర్‌వైజర్ సునీత అన్నారు. బుధవారం ఈపూరు–1 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
NTR: గంపలగూడెం మండలం కనుమూరు గ్రామంలో అత్తునూరి నాగలక్ష్మికి రూ. 47 వేలు, కొమ్ము రాజేష్ కి రూ.50 వేలు విలువ గల CMRF చెక్కులను లబ్ధిదారులకు వారి ఇంటి వద్ద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం అందజేశారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళం నగరంలోని టీపీఎం స్కూల్ సమీపంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకళ నేచురల్స్ మిల్ స్టోర్‌ను ఎమ్మెల్యే శంకర్ బుధవారం ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు పసుపు, కారం, రాగి వంటి పదార్థాలను మిల్లులో ఆడించి అక్కడే వినియోగదారులకు విక్రయించే విధంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
మహిళల కోసం BSNL సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘కవచ్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ద్వారా ఇకపై మహిళలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో తమ ఫోన్ నంబర్‌ను చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మహిళల ఫోన్ నంబర్లను ప్రైవేటుగా ఉంచుతుంది. అనవసరమైన ఫోన్ కాల్స్ లేదా నంబర్ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పిస్తుంది.
NLG: దేవరకొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య సహా 400 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, పోలీస్ శాఖ కాంగ్రెస్ నేతలకు తొత్తులుగా మారిందని ఆరోపించారు. జిల్లా మంత్రులు ఉండి కూడా సాగర్, ఎస్ఎల్బీసీ కింద నీళ్లివ్వలేదని విమర్శించారు.
జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘వదలా’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా నిర్మించాలంటే భయం వేసిందని, దర్శకుడికి కథపై ఉన్న నమ్మకమే తనను ముందుకు నడిపించిందని తెలిపాడు. ఇండస్ట్రీలో తన మనుగడ కష్టమనుకున్న సమయంలో ఈ సినిమా తీశామని, జగపతి బాబు లేకుండా ఈ చిత్రాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నాడు.
MBNR: మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కల్వకుర్తికి చెందిన రఘుకుమార్ బుధవారం మరికల్ రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైలు కోసం వేచి చూసిన ఆయన, అది రాకపోవడంతో అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.