• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో భారీ చోరీ

HYD: హబ్సిగూడలో నివసించే ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఇంట్లో పనిమనిషే 9.30 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆమె వద్ద నుంచి దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:26 PM IST

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ సీఎం

KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

February 25, 2026 / 08:26 PM IST

‘జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలి’

E.G: రేపటి నుంచి ప్రారంభం కానున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డికర్ల సువర్ణ రాజు పిలుపునిచ్చారు. బుధవారం దేవరపల్లిలో జనసేన వాలంటీర్లతో సమావేశమై మాట్లాడారు. సభ్యత్వంలో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరించి అందరూ ఉద్యమి సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు.

February 25, 2026 / 08:26 PM IST

‘ఆదివాసీ మహిళల హక్కుల సదస్సును విజయవంతం చేయాలి’

MHBD: బయ్యారం మండల కేంద్రంలో బుధవారం తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8న గుండాలలో నిర్వహించనున్న ఆదివాసీ మహిళల హక్కుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర సదస్సు పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు ఉన్నారు.

February 25, 2026 / 08:25 PM IST

రేపు నెల్లూరులో జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 8:45 గంటలకు కడప పులివెందుల భాకరాపురం నివాసం నుంచి బయలుదేరి 8:50 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నెల్లూరు‌లోని పీవీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్కిల్ డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొనున్నారు.

February 25, 2026 / 08:22 PM IST

లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా కైలాష్

ADB: లంబాడి హక్కుల పోరాట సమితి నార్నూర్ మండలాధ్యక్షుడిగా జాదవ్ కైలాష్ బుధవారం నియామకమయ్యారు. ఈ సందర్బంగా LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. లంబాడీ-బంజారా సమాజాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం, లంబాడీల హక్కుల సాధన కోసం కృషి చేయాలనీ పేర్కొన్నారు. దీంతో పలువురు కైలాష్‌ను అభినందించారు.

February 25, 2026 / 08:22 PM IST

నూతన డైనింగ్ హాల్‌ను ప్రారంభించిన కలెక్టర్

CTR: బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

February 25, 2026 / 08:22 PM IST

అకాల వర్షాలతో మామిడి రైతు విలవిల

VKB: కుల్కచర్ల మండలంలో అకాల వర్షాంతో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వేరుశనగ రైతులు పల్లికాయలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మామిడి రైతులు మాత్రం దిగాలుగా ఉన్నారు. వేసవికాలంలో వర్షాలు కురుస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని బాధిత రైతులు వాపోతున్నారు.

February 25, 2026 / 08:21 PM IST

మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

SRCL: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఖదీర్ పాషా వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 08:18 PM IST

‘చిత్తడి నేలలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం’

NRML: చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

February 25, 2026 / 08:15 PM IST

లైఫ్ సర్టిఫికెట్ లేకుంటే పెన్షన్ కట్

VSP: జిల్లా పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ సమర్పించేందుకు ఈనెల 28వ తేదీయే ఆఖరి గడువని జిల్లా ట్రెజరీ అధికారి కే. మోహన్ రావు ప్రకటించారు. గడువు దాటితే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని, జిల్లాలో ఇంకా 2,476 మంది సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

February 25, 2026 / 08:14 PM IST

వైసీపీ మాపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి

AP: వైసీపీ తమపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ‘టీటీడీ పర్చేజ్ కమిటీ నిబంధనల మార్పుపై వైసీపీ వక్రభాష్యం చెబుతోంది. స్టార్టప్ డెయిరీలు కూడా టెండర్‌లో పాల్గొనేలా నిబంధనలు మార్చాం. కంపెనీల మధ్య పోటీతత్వం ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. పాలు లేకుండా, పామాయిల్‌తో కల్తీ చేసే వారిని అనుమతించాలని అనడం లేదు’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు: డీపీవో

JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

విద్యార్థులకు బిగ్ అలర్ట్

మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్స్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని తెలిపింది. ఈనెల 26 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది.

February 25, 2026 / 08:12 PM IST

‘కేవిటి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి’

SKLM: వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో ఉన్న కేవీటీల కులాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేవీటీలకు రాష్ట్రం బీసీగా గుర్తింపు నిచ్చారు. అయితే కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. కేవిటి కులాన్ని కేంద్ర ఓ.బి.సి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 08:12 PM IST