• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు నూకాంబిక అమ్మవారి ఆలయం మూసివేత

AKP: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3వ తేదీన అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని మూసివేసి దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు తలుపులు మూసివేస్తామని గ్రహణ మోక్ష కాలం అనంతరం 4వ తేదీ ఉదయం 6 గంటలకు ఆలయాన్ని తెరుస్తామన్నారు. సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.

March 2, 2026 / 05:22 AM IST

మంత్రాలయం సీఐ హెచ్చరిక

KRNL: అనుమతులు లేకుండా టపాసులు, పేలుడు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదివారం మంత్రాలయం సీఐ రామానుజులు హెచ్చరించారు. జాతరలు, దేవరలు, పెళ్లిలలో అనుమతులు లేకుండా టపాసులు ఉపయోగించరాదని పేర్కొన్నారు. హోటల్ యజమానులు అనుమతులు లేకుండా గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి, అనుమతులు ఉండి సరైన పద్ధతిలో ఫైర్ సేఫ్టీ విధానాలను పాటించాలని సూచించారు.

March 2, 2026 / 05:21 AM IST

స్కూటర్ ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె క్రాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న జయప్రకాష్ (15) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ముదివేడు వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జయప్రకాష్ కాలు విరిగింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 05:20 AM IST

దొరమామిడిలో ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: దొరమామిడి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వలస కూలి మరణించాడు. పల్పాడు జిల్లా రాజపాలెం మండలం గణపవరానికి చెందిన మురికిపూడి నాని (23) పొగాకు తోటలో పనులకు దొరమామిడి వచ్చాడు. వ్యక్తిగత పని మీద వెళ్లి బైక్‌పై దొరమామిడి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాని అక్కడికి అక్కడే మృతి చెందాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 05:20 AM IST

మార్చి 3న జిల్లాలోని ఆ ఆలయాల మూసివేత

NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయాలను మార్చి 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవోలు పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాగంటి ఆలయంలో మంగళవారం ఉదయం 6.30కి ప్రాతః కాల పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసి 4 తెల్లవారుజామున శుద్ధిచేసి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 2, 2026 / 05:17 AM IST

మార్చి 3న జిల్లాలోని ఆ ఆలయాలు మూసివేత

NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయాలను మార్చి 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవోలు పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాగంటి ఆలయంలో మంగళవారం ఉదయం 6.30కి ప్రాతః కాల పూజల అనంతరం ఆలయాన్ని మూసివేసి 4 తెల్లవారుజామున శుద్ధిచేసి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 2, 2026 / 05:17 AM IST

అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం: ఎమ్మెల్యే

ATP: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గతంలో రెండుసార్లు వేతనాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు.

March 2, 2026 / 05:06 AM IST

ఈ-పంట నమోదుకు నేడే తుది గడువు

CTR: చిత్తూరు జిల్లాలో రబీ పంటల ఈ-పంట నమోదు 95 శాతం పూర్తైంది. మొత్తం 3.85 లక్షల పార్సిల్స్‌లో 3.66 లక్షల పార్సిల్స్ నమోదు అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి తెలిపారు. గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో 100 శాతం నమోదు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 05:04 AM IST

నేడు డోన్‌కు MLA కోట్ల రాక

NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం డోన్‌లో పర్యటించనున్నట్లు టీడీపీ మండల నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని నాయకులు కోరారు.

March 2, 2026 / 04:50 AM IST

నేడు నంద్యాల కలెక్టరేట్‌లో PGRS

నంద్యాల జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ జీ.రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

March 2, 2026 / 04:47 AM IST

విద్యా హక్కు చట్టం పేద విద్యార్థులకు వరం

KDP: పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ఒక వరమని BJP జిల్లా అధికార ప్రతినిధి హరి ప్రసాద్ అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ..ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదింటి పిల్లలకు కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. విద్య ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని, 2026-27లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 04:43 AM IST

షాద్‌నగర్‌లో డీసీపీ కార్యాలయం ప్రారంభం.!

RR: షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. డీసీపీ శిరీష కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. షాద్ నగర్ ప్రాంతాన్ని ప్రభుత్వం ఇటీవల డీసీపీ స్థాయికి పెంచిన నేపథ్యంలో, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై డీసీపీ ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

March 2, 2026 / 04:42 AM IST

నేటి నుంచి శ్రీశైలం పాదయాత్రకు అనుమతి: ఈవో

NDL: ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి పాదయాత్రకు అనుమతి ఉందని శ్రీశైలం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని, భక్తుల సౌకర్యార్థం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉత్సవాలు మార్చి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల భక్తులు హాజరువుతాయన్నారు.

March 2, 2026 / 04:40 AM IST

నేడు డయల్ యువర్ APSPDCL సీఎండీ

KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండి లోతేటి శివశంకర్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు ఏమైనా సమస్యలు ఉంటే 8977716661కు ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరిస్తామన్నారు.

March 2, 2026 / 04:35 AM IST

నేడు మదనపల్లిలో PGRS అర్జీల స్వీకరణ

KDP: మదనపల్లె కలెక్టరేట్‌లో సోమవారం PGRS ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.

March 2, 2026 / 04:29 AM IST