• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిని క్షేమంగా తెచ్చేందుకు చర్యలు

VZM: గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. APNRTS కో-ఆర్జినేటర్ల ద్వారా బాధితులకు ఇప్పటికే తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామని, బాధితులందరినీ త్వరలోనే స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అధికారులను సంప్రదించాలన్నారు.

March 3, 2026 / 06:54 AM IST

గ్రామాల్లో కాముని దహనం

SDPT: జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు సోమవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం డప్పు చప్పుళ్ల మధ్య ఇంటింటికీ తిరుగుతూ ఆవు పేడ పిడకలు, మొక్కజొన్న కంకి బెండ్లను సేకరించారు. ప్రధాన కూడళ్లలో కాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సంప్రదాయబద్ధంగా దహనం చేశారు. మంగళవారం రంగుల కేళి జరుపుకునేందుకు గ్రామీణులు ఉత్సాహంగా సిద్ధమయ్యారు.

March 3, 2026 / 06:54 AM IST

భారీగా పడిపోయిన టమాటా ధర

TG: టమాటా ధర భారీగా పతనమైంది. వ్యాపారులు కిలోకు రూ.4 కూడా పెట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో ధర పడిపోయింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు టమాటాలను ఫ్రీగా జనాలకు పంచుతున్నారు.

March 3, 2026 / 06:53 AM IST

నేడు వైన్ షాపుల్ బంద్

HYD: హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇవాళ మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 3, 2026 / 06:52 AM IST

పదవీ విరమణ ప్రయోజనాలు రాక రిటైర్డ్ ఎస్సై మృతి

WGL: రాయపర్తి మండలం మైలారం చెందిన రిటైర్డ్ ఎస్సై లేతకుల బుచ్చి రెడ్డి (61) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. 1984లో కానిస్టేబుల్‌గా చేరి సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన 2026 జనవరిలో కేయూ స్టేషన్ ఎస్సైగా పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ సెటిల్‌మెంట్ ఆలస్యం కావడంతో మానసిక ఆందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

March 3, 2026 / 06:52 AM IST

నేడు కలెక్టరేట్‌ల ఎదుట మహాధర్నా: ఏపీటీఎఫ్

AP: విద్య, ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థిక డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఏపీటీఎఫ్ మహాధర్నాలు నిర్వహించనుంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం కనిపించలేదని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు తెలిపారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

March 3, 2026 / 06:49 AM IST

టీచర్స్ కాలనీలో ఘనంగా కామదహనం!

VKB: హోలీ పండుగను పురస్కరించుకుని పరిగిలోని టీచర్స్ కాలనీలో కామదహన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ వారాల రవీంద్ర ఆధ్వర్యంలో కాలనీవాసులు, యువకులు కలిసి సంప్రదాయబద్ధంగా కాముడిని దహనం చేశారు. కౌన్సిలర్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. పండుగను అందరూ ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

March 3, 2026 / 06:48 AM IST

‘హోలీ వేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు’

SDPT: హోలీ పండుగను సంప్రదాయబద్ధంగా, సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని బెజ్జంకి మండలం ఎస్సై బోయిని సౌజన్య సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బలవంతంగా రంగులు చల్లడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించవద్దని స్పష్టం చేశారు.

March 3, 2026 / 06:46 AM IST

4 బ్యాంకు ఉద్యోగాలు సాధించిన బొబ్బిలి వాసి

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని నాయుడు కాలనీకు చెందిన పెంట రాకేశ్ కుమార్ ఒకేసారి 4 బ్యాంకు ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు. సోమవారం విడుదలైన బ్యాంకు ఫలితాలలో రాకేశ్ కెనరా బ్యాంకు పీవో, రీజనల్ రూరల్ బ్యాంకు పీవో, స్టేట్ బ్యాంకు క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్ ఉద్యోగం సాధించారు. మూడో ప్రయత్నంలో ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించాడు.

March 3, 2026 / 06:45 AM IST

చైన్ స్నాచర్ అరెస్ట్.. నగలు, స్కూటీ స్వాధీనం

ATP: బ్రహ్మసముద్రం మండలంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడు బండి సుబ్రహ్మణ్యంను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.లక్షన్నర విలువైన బంగారు గొలుసు, స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో పలు దొంగతనాలకు పాల్పడిన ఇతడు, జైలు నుంచి విడుదలైన వెంటనే మళ్ళీ నేరాలకు ఒడిగట్టాడని పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు.

March 3, 2026 / 06:45 AM IST

నాటు సారా పూర్తిస్థాయిలో నివారించాలి: కలెక్టర్

NDL: నాటు సారా విక్రయదారుల కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏ కేటగిరిలో 19 గ్రామాలు, బీ కేటగిరీలో 19 గ్రామాలు, సీ కేటగిరీలో 91 గ్రామాలలో నాటు సారాను పూర్తిస్థాయిలో నివారించడానికి చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు.

March 3, 2026 / 06:43 AM IST

అమరావతి క్వాంటం వ్యాలీకి రూ.10 కోట్ల విడుదల

AP: అమరావతి క్వాంటం వ్యాలీకి రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నుంచి అందిన ప్రతిపాదన మేరకు ఆ మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

March 3, 2026 / 06:41 AM IST

ఘనంగా కామ దహన కార్యక్రమం

SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కామ దహనం ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది పిడకలతో కట్టెలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముని చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అర్చకులు ఆయాచితుల పవన్ శర్మ ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా కామదాహనం నిర్వహించారు.

March 3, 2026 / 06:39 AM IST

గీత కార్మికుడి కుటుంబానికి పీఎంఎస్‌బీవై చెక్కు అందజేత

BHNG: రాజాపేట మండలంలోని నేమిలే గ్రామానికి చెందిన గీత‌ కార్మికుడు పాల సిద్దులు ఇటీవల తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. సిద్దులు రాజాపేట ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.20 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజ‌న తీసుకోగా ప్రమాద బీమా కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును బ్యాంక్ మేనేజర్ రవితేజ, సర్పంచ్ పులి రాజు నామిని అయిన సిద్ధులు భార్య స్వాతికి సోమ‌వారం అందజేశారు.

March 3, 2026 / 06:39 AM IST

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యం: కలెక్టర్

ADB: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్-100 ను ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో హెల్త్ మిషన్-100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

March 3, 2026 / 06:37 AM IST