• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ

NRML: నిర్మల్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం జరిగిన వీక్లీ పరేడ్‌లో జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిట్నెస్, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ ఏఎస్పి సాయి కిరణ్ తదితరులు హాజరయ్యారు.

February 28, 2026 / 09:06 AM IST

9,750 కుటుంబాలకు రంజాన్ తోఫా

NLG: రంజాన్ పండగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు అందజేసేందుకు ప్రభుత్వం కానుకలు సిద్ధం చేసింది. పండుగ సమీపిస్తుండటంతో రంజాన్ తోఫా ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చేరవేసింది. దీంతో భాగంగా ఉమ్మడి జిల్లాలో పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి తోఫా అందించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 9,750 కుటుంబాలను అధికారులు గుర్తించారు.

February 28, 2026 / 09:04 AM IST

దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని నిన్న సూచించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పథకాల పురోగతిని సమీక్షించారు. జిల్లాలో 10 వేల ఇందిరమ్మ ఇళ్లులు స్లాబ్ దశకు చేరాయని మధ్యాహ్న భోజన నాణ్యత జాతీయ రహదారి పనులు వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

February 28, 2026 / 09:03 AM IST

కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి రూ.10,000 పెన్షన్

సత్యసాయి: ధర్మవరం పట్టణం 8వ వార్డు కేశవనగర్‌కు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉదయ్ కుమార్‌కు మంత్రి సత్యకుమార్ ప్రత్యేక చొరవతో రూ.10,000 పెన్షన్ మంజూరైంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు శనివారం ఉదయ్ కుమార్‌కు పెన్షన్ మొత్తాన్ని స్వయంగా అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 09:03 AM IST

తుమ్మితే అశుభమా?.. మూఢ నమ్మకమా..?

తుమ్ములు అశుభ సంకేతాలనుకోవడం మనసులోని బలహీనత మాత్రమే! శరీర వ్యవస్థలో వచ్చే మార్పుల వల్లనో, వాతావరణ ప్రభావం చేతనో, ఆహారంలో మార్పు కారణంగానో ఎవరికైనా.. ఎప్పుడైనా తుమ్ములు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. శరీర ధర్మాలు తప్పవు కదా! ఆ తుమ్ములకూ, మనకు వచ్చే శుభాశుభాలకూ ఏ సంబంధం లేదన్నారు. ఇది కేవలం ఓ మూఢ నమ్మకం మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చన్నారు.

February 28, 2026 / 09:02 AM IST

జనాభా లెక్కల సేకరణపై శిక్షణ: కమిషనర్

E.G: రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జనాభా లెక్కల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో రెండు దశల్లో ప్రక్రియను పారదర్శకంగాపూర్తి చేయాలని, నేషనల్ ట్రైనర్స్ ఇచ్చే పద్ధతిని అనుసరించాలని సూచించారు.

February 28, 2026 / 09:02 AM IST

ఎండపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన MPDO

AKP: కోటవురట్ల మండలం ఎండపల్లిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ శనివారం ఉదయం ప్రారంభించారు. మండలంలో ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిందన్నారు. 9,274 మందికి పింఛన్లను సాయంత్రంలోగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఉదయం 8:30 గంటల వరకు 3,532 మందికి పింఛన్లు అందజేసామన్నారు.

February 28, 2026 / 09:02 AM IST

వంద శాతం ఇంటి పన్నులు వసూళ్లు చేయాలి: MPDO

AKP: అధికారులు సిబ్బంది ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని డివిజన్ అభివృద్ధి అధికారిణి మంజులవాణి ఆదేశించారు. సబ్బవరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. పనుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిజిటల్ విధానంలో పనులు చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

February 28, 2026 / 09:02 AM IST

కంభంలో శక్తి యాప్ పై అవగాహన

ప్రకాశం: కంభం పట్టణంలో శుక్రవారం స్థానిక మహిళలకు, పాఠశాల విద్యార్థులకు పోలీసులు భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. ఆపదలో మహిళలను రక్షించే శక్తి యాప్ గురించి వివరించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ పోలీసులకు ఎలా సమాచారం అందిస్తుందో ప్రత్యక్షంగా చూపించారు.

February 28, 2026 / 09:02 AM IST

వామ్మో గుట్టలను తలపిస్తున్న.. గుర్రపు డెక్క..!

HYD: నగరంలో అనేక చెరువుల్లో గుర్రెపుడెక్క సమస్య విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస ఫిర్యాదులతో పలుచోట్ల గుర్రపు డెక్క తొలగింపు ప్రారంభమైంది. ఓ చెరువు వద్ద గుర్రపు డెక్క కట్టపై పోస్తుంటే ఓ గుట్టను తలపిస్తోంది. ఒక్కో చెరువులో ఎన్ని టన్నుల గుర్రపు డెక్క ఉందో..? దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంత పెద్ద సమస్యకు దశాబ్దాలు గడుస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

February 28, 2026 / 09:01 AM IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

KMR: ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో లావణ్య (25) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని తల్లి నరసవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

February 28, 2026 / 09:01 AM IST

బాలలయంలో విగ్రహ ప్రతిష్ట పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం బాలాలయంలో స్వామివారి టేకు విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 28, 2026 / 09:00 AM IST

ఎమ్మెల్యేకు వెటర్నరీ విద్యార్థుల వినతి

VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శుక్రవారం గరివిడి వెటర్నరి కాలేజీ విద్యార్థులు కలిసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా వెటర్నరీ గ్రాడ్యుయేట్లు వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ పోస్ట్‌ గ్రామీణ పశుసంవర్థక వ్యవస్థలో అత్యంత కీలకమన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసువెళ్లాలని ఆయనకు వినతిపత్రం అందించారు.

February 28, 2026 / 09:00 AM IST

జోరుగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

PPM: కొమరాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సొమ్మును అందించారు. కొమరాడ మండల రైతు అధ్యక్షుడు బత్తిలి శ్రీను ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST

డయేరియాకు ‘ఈ-కోలి’ బ్యాక్టీరియానే కారణం: కమిషనర్

SKLM: నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటివరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

February 28, 2026 / 09:00 AM IST