• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తిరుపతికి రూ.138 కోట్లు ఇవ్వండి: MLA

తిరుపతిలో 30ఏళ్ల క్రితం నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UDG) సిస్టమ్ దెబ్బతిందని MLA శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రస్తావించారు. తిరుపతిలో పాత 60KM డ్రైనేజీ బాగు చేసి కొత్తగా 125KMల మేర UDG నిర్మాణానికి రూ.152కోట్లు కావాలని, అలాగే 42వేల ఇళ్లకు కొత్తగా కనెక్షన్ ఇవ్వడానికి రూ.36కోట్లు అవసరం అని MLA కోరారు. ఇప్పటికే ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

February 27, 2026 / 12:36 PM IST

అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు

TG: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -2లో అండర్‌పాస్ పనులు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ పనుల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ముగ్ధ జంక్షన్ నుంచి KBR చెక్‌పోస్ట్ వరకు ఆంక్షలు విధించారు. వాహనాదారులు ప్రత్యామ్యాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

February 27, 2026 / 12:36 PM IST

విరోష్‌ జోడీకి సెలబ్రిటీల శుభాకాంక్షలు

టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సమంత, కరణ్ జోహార్, నాని, కాజల్ అగర్వాల్, కృతి సనన్ వంటి ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తమ అభిమాన నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో పండగ చేసుకుంటున్నారు.

February 27, 2026 / 12:36 PM IST

మహోత్సవానికి భక్తులకు నీటి ట్యాంకర్లు ఏర్పాటు

KRNL: సొగనూరు గ్రామంలో జరగనున్న సుంకలమ్మ, మారెమ్మ అవ్వల దేవాలయం మహోత్సవానికి భక్తులకు ఇబ్బంది లేకుండా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తిపై బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ వెంటనే స్పందించారు. ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 12:35 PM IST

పేదలకు ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 27, 2026 / 12:34 PM IST

పోచారం ప్రాజెక్టు నుంచి 0.541టీఎంసీల నీటిని విడుదల

KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం ఇప్పటి వరకు 0.541TMCల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాకాలం నుంచి ప్రాజెక్టులోకి మొత్తం 30.543 TMCల నీరు వచ్చి చేరిందని అన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత వల్ల 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోందని వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820TMCలు కాగా,ప్రస్తుతం 1.05TMC నీరు నిల్వ ఉంది.

February 27, 2026 / 12:34 PM IST

ధ్వజ స్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న హరీశ్ రావు

సిద్దిపేట పట్టణంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ సభ్యులు హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజ స్తంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

February 27, 2026 / 12:34 PM IST

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధి దేవుని ఎర్రవల్లి 3వ వార్డులో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని కౌన్సిలర్ మీనాక్షి సత్యనారాయణ నిలబెట్టుకున్నారు. శుక్రవారం పాత బోరుకు మరమ్మతులు చేయించి నీటిని ప్రారంభించారు. ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ పరిష్కరించే కౌన్సిలర్‌పై వార్డు ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:32 PM IST

కడిగిన ముత్యంలా బయటకు వచ్చా: కవిత

TG: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. తనకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని చెప్పానని.. కోర్టు తీర్పుతో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు.

February 27, 2026 / 12:32 PM IST

గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే

SRD: వీరారెడ్డిపల్లిలో రూ.25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మొల్లగూడెం పాఠశాల ప్రహరీ గోడకు రూ.10 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

February 27, 2026 / 12:31 PM IST

రేపల్లెలో అనగాని ప్రజా దర్బార్

BPT: రేపల్లెలో శుక్రవారం ‘అనగాని ప్రజా దర్బార్’ కార్యక్రమం జరిగింది. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు.

February 27, 2026 / 12:30 PM IST

మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆకతాయి వీరంగం

GNTR: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలోకి శుక్రవారం ఓ అజ్ఞాత వ్యక్తి చొరబడ్డాడు. కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్ల అద్దాలను అతడు ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఆకతాయిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హుటాహుటిన మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

February 27, 2026 / 12:30 PM IST

కలంకారీ వస్త్రాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు

కృష్ణా: అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా కలంకారీ వస్త్రాలను శుక్రవారం ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, కుమార్ సందర్శించి వస్త్రాలను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన కలంకారి పరిశ్రమ పెడనలో నియోజకవర్గంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని కృష్ణ ప్రసాద్ అన్నారు. త్వరలో కలంకారి క్లస్టర్ పెడనలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 12:30 PM IST

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్యసాయి: ధర్మవరం మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

February 27, 2026 / 12:30 PM IST

సిబ్బంది కొరతతో కల్తీ కోరల్లో ఆహారం

ATP: జిల్లాలో ఆహార కల్తీపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. హోటళ్లు, దాబాల్లో నాసిరకం నూనెలు, హానికర రంగులు వాడుతుండటంతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. అయితే, జిల్లాలో ఫుడ్ తనిఖీ కోసం కేవలం ఒక్కరే ఆహార భద్రతా అధికారి ఉండటం గమనార్హం. సిబ్బంది కొరత అక్రమార్కులకు వరంగా మారింది. ఖాళీలను భర్తీ చేసి తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

February 27, 2026 / 12:30 PM IST