• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అనంతలో మార్చి1న బాలు శతగళార్జన

ATP: అనంత నాగ్ సంగీత్ కల్చరల్ అసోసియేషన్, ఎల్కేపి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బాలు శత గళార్జన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లలిత కళాపరిషత్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ హాజరవుతారన్నారు.

February 27, 2026 / 01:00 PM IST

చేనేత కార్మికుల నిరసన బాట

GNTR: చేనేత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని చేనేత కార్మిక సంఘం నాయకుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..చేనేత పరిరక్షణ చట్టం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

February 27, 2026 / 01:00 PM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. GHMCని MIMకు అప్పగించేందుకే మూడు జోన్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ మేయర్ MIMకి మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కాంగ్రెస్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీని దెబ్బకొట్టేందుకే GHMC విడదీశారని తెలిపారు.

February 27, 2026 / 12:59 PM IST

సోము వీర్రాజుపై దాడి హేయం

SKLM: ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు భౌతిక దాడికి పాల్పడటం హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం అన్నారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారిందన్నారు.

February 27, 2026 / 12:57 PM IST

సీఐగా బాధ్యతలు చేపట్టిన మద్దయ్యచారి

తిరుపతి రూరల్ పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కొత్త సీఐ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో మద్దయ్యచారి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

February 27, 2026 / 12:56 PM IST

భూదాన్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి

BDK: భూదాన్ భూముల్లో నష్టపోయిన ప్రతి బాధితుడిని న్యాయం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం స్పందించారు. ఎక్కడ స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. స్థలాన్ని మోసపూరితంగా అమ్మిన వారు జైల్లో ఉంటారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 12:56 PM IST

కలెక్టర్‌పై విచారణ జరపాలి: అమర్నాథ్

AP: అనకాపల్లి కలెక్టర్‌పై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. ఆలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరగాలని, కన్యకాపరమేశ్వరి భూములపై పోరాడుతామని హెచ్చరించారు.

February 27, 2026 / 12:55 PM IST

శ్రీ పంచకం పోస్టల్ ఆవిష్కరణ

AKP: అనకాపల్లి బీజేపీ కార్యాలయంలో స్త్రీ పంచకం కార్యక్రమ పోస్టర్లు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందులో మహిళా జనరల్ సెక్రటరీ రోహిణి తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 12:53 PM IST

రేపటి నుంచి స్వచ్ఛ రథంపై అవగాహన

KDP: సింహాద్రిపురం మండలంలోని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ నుంచి నెల రోజులపాటు స్వచ్ఛ రథంపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సింహాద్రిపురంలో స్వచ్ఛరథం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తడి, పొడి చెత్తను సేకరించి ఇస్తే సరుకులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

February 27, 2026 / 12:51 PM IST

28వ వార్డులో చెట్ల కొమ్మల తొలగింపు

SRPT: కోదాడ పట్టణంలోని 28వ వార్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను శుక్రవారం తొలగించారు. వార్డు కౌన్సిలర్ తోట జ్యోతి శ్రీను ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. విద్యుత్ అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు. ఈ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 12:51 PM IST

INDW vs AUSW: ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(52), హర్మన్ ప్రీత్‌(54) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లు ఆష్లీ గార్డనర్, అలానా కింగ్, అన్నాబెల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసీస్ టార్గెట్: 252.

February 27, 2026 / 12:51 PM IST

ఫోటో గ్రాఫర్ల భవనానికి ‘బోరు’ దాతగా మాజీ కౌన్సిలర్

దేవరకొండలో స్థానిక వీడియో, ఫోటో అసోసియేషన్ భవన అవసరాల కోసం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ మంచినీటి బోరును వేయించి తన ఉదారతను చాటుకున్నారు. భవన నిర్మాణంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని గుర్తించిన ఆమె సొంత ఖర్చులతో బోరు వేయించి ఫోటోగ్రాఫర్లకు అండగా నిలిచారు. ​ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

February 27, 2026 / 12:49 PM IST

నేను ఇంకో ఓవర్ బౌలింగ్ చేయాలి: హార్దిక్

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌పై హార్దిక్ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ విషయానికి వస్తే, చాలా బాగుంది. నాకు కొత్త బంతితో బౌలింగ్ చేయడం ఇష్టం. దేవుడి దయ వల్ల నా దగ్గర ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేసే నైపుణ్యం ఉంది. నేను దానిని నిజంగా ఆస్వాదిస్తాను. కానీ, నేను ఇంకా ఒక ఓవర్ బౌలింగ్ చేయాల్సింది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ ఓవర్ వేస్తాను’ అని అన్నాడు.

February 27, 2026 / 12:49 PM IST

మీటర్ల ‘మాయాజాలం’.. రూ. 450 కోట్ల SCAM..?

HYD: నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్‌లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ. 450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.

February 27, 2026 / 12:49 PM IST

భూ రీ సర్వే విషయంలో ఘర్షణ.. కేసు నమోదు

ATP: పెద్దవడుగూరు మండలం కొండూరు సమీపంలో భూ రీ-సర్వే విషయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రవ్వుకున్నారు. ఈ ఘటనలో రామన్న అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

February 27, 2026 / 12:45 PM IST