• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా?

దానిమ్మ పండు పోషకాల గని. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీని రసం తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం డిటాక్స్ అవుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, మెరిసే చర్మానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది.

February 27, 2026 / 09:28 AM IST

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. 2019లో 29వ ర్యాంకులో ఉంటే 2023లో 76కి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు 41వ ర్యాంకుకు తీసుకొచ్చామని వెల్లడించారు. టాప్ 10 యూనివర్సిటీగా తీసుకురావాలన్నదే లక్ష్యమని చెప్పారు.

February 27, 2026 / 09:28 AM IST

పాలమూరు యూనివర్సిటీ.. ఫలితాలువిడుదల

MBNR: పాలమూరు యూనివర్సిటీలో 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ VII-సెమిస్టర్ రెగ్యులర్,బ్యాక్ లాగ్ ఫలితాలను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 69.39% ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రవీణ,చంద్ర కిరణ్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపారు.

February 27, 2026 / 09:27 AM IST

జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్టు

MDK: తూప్రాన్ పట్టణంలోని సయ్యద్ సాదిక్ కు చెందిన కారు మెకానిక్ గ్యారేజ్ నుంచి చోరీలకు పాల్పడిన ఇరువురిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. దుబ్బాకకు చెందిన తూర్పాటి సంజయ్ (25), పర్వతం రాజయ్య (27) గురువారం తెల్లవారుజామున విలువైన కేబుల్స్ చోరీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు.

February 27, 2026 / 09:26 AM IST

అమెరికాను అధిగమించనున్న భారత్

అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ‘షెల్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2040ల్లో అమెరికాను, 2060ల్లో చైనాను ఇంధన గిరాకీలో భారత్ అధిగమించగలదని అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో సహజ వాయువు, LNG కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. వీటి గిరాకీ 50% లేదా అంతకంటే ఎక్కువ పెరగొచ్చని పేర్కొంది.

February 27, 2026 / 09:26 AM IST

ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసుల కార్డన్ సెర్చ్

కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, వికలాంగుల కాలనీల్లో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఒక మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై సైబర్ క్రైమ్స్, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన కల్పించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

February 27, 2026 / 09:26 AM IST

కురుపాం గురుకులంలో డయేరియా

AP: పార్వతీపురం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో బాలికలు డయేరియాకు గురయ్యారు. నలుగురు బాలికలకు వాంతులు, విరేచనాలు కావడంతో కురుపాం ఆస్పత్రికి విద్యార్థినులను తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స కొనసాగుతోంది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది గురుకులంలో పారిశుధ్యం పనులు చేపట్టారు. విద్యార్థినుల ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 09:23 AM IST

ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన నిఖిల్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో నిఖిల్ OTTలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తాను త్వరలోనే ఒక వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. దీని ద్వారా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంట్రీ ఉంటుందని తెలిపాడు. మరి ఆయన OTT ఎంట్రీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

February 27, 2026 / 09:22 AM IST

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

February 27, 2026 / 09:21 AM IST

VIDEO: కల్తీ రాయుళ్లకు కలెక్టర్ వార్నింగ్

W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

February 27, 2026 / 09:21 AM IST

గన్నవరంలో కూరగాయలు ధరలు ఇవే.!

క‌ృష్ణా: గన్నవరం మార్కెట్‌లో రోజువారీ వినియోగించే ప్రధాన కూరగాయల ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. టమాటా రూ.14, గులాబీ వంకాయలు రూ.17-18గా నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ రూ.26, దోస.24, బీట్‌రూట్ రూ.25గా విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ.59, ఫ్రెంచ్ బీన్స్ రూ.53గా ఉన్నాయి. బీర రూ.24, పచ్చిమిర్చి రూ.36, నిమ్మకాయలు డజన్‌కు రూ.48/36గా ఉన్నాయి.

February 27, 2026 / 09:20 AM IST

వైరల్‌గా మారిన సచివాలయ ఉద్యోగిని లెటర్

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మధ్యలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 27, 2026 / 09:20 AM IST

‘ఒక్కరోజు ముందుగానే సామాజిక పెన్షన్ పంపిణీ’

E.G: మార్చి నెల NTR సామాజిక భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు , వికలాంగులు, వితంతువులకు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి తారీకు ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28న తారీఖున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

February 27, 2026 / 09:20 AM IST

3న వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

TG: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మార్చి 3న ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతోపాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ.3:30కు ప్రారంభమై పాక్షిక చంద్రగ్రహణం సా.6 గంటలకు ముగుస్తుంది.

February 27, 2026 / 09:20 AM IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

WGL: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

February 27, 2026 / 09:20 AM IST