సత్యసాయి: కూటమి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తెలిపారు. గోరంట్లలో మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు బుధవారం అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త నిమ్మల యువశేఖర్‌తో పాటు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నిరుపేదలకు ఆమె తోపుడు బండ్లను పంపిణీ చేసి, అభిమానులకు అన్నదానం చేశారు.
KNR: కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLG: మండల కేంద్రంలో కేవలం ముందస్తు బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా పంపిణీ చేస్తున్నారు. అయితే నిమిషాల్లోనే స్టాక్ అయిపోవడంతో సామాన్య రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని యూరియా బస్తాలను అందుబాటులోకి తేవాలని, స్టాక్ వివరాలను ముందే తెలియజేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. పంపిణీ సక్రమంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
AP: చిత్తూరు జిల్లా తుమ్మెదపాలెంటో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. సాయికుమార్ అనే వ్యక్తిపై ఢిల్లీ అనే యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు సాయికుమార్ మృతి చెందాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: అనంతగిరి మండలం పాలవరంలోని పురాతన బాల ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఎ రవి సుమారు రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించారు. బుధవారం సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ స్లాబ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మికతకు రవి అందిస్తున్న సహకారం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
E.G: ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకల్లా రోడ్లను ఊడ్చి.. చెత్త కుప్పలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.
NZB: ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. ఆటో ప్రమాదవశాత్తు కెనాల్లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని బుధవారం ఐఆర్టీఎస్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ అధికారులు వారికి క్షేత్ర విశిష్టతను వివరించారు.
ATP: వేసవి కాలం ప్రారంభం కావడంతో అనంతపురం మార్కెట్‌లో పుచ్చకాయలకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం కిలో పుచ్చకాయ ధర రూ. 20 నుంచి రూ. 25 వరకు పలుకుతోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు చలవ కోసం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రధాన కూడళ్లలో పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ పాత ట్రస్ట్ ఎదురుగా ఉన్న విజేత మార్ట్‌లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సొళ్ళు పిండి, ఖర్జూరం వంటి పదార్థాలు నాణ్యత లోపంతో పెంకు పురుగులతో ఉండటంతో వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించారు. నాణ్యత లోపించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NLR: రాపూర్ మండలం గండూరుపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ నిమ్మరైతు శ్రీ బి వెంకట్ రెడ్డి పొలాన్ని బుధవారం పొదలకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివ నాయక్ సందర్శించారు. ఏ-వన్ గ్రేడ్, ఏటీఎం మోడల్‌ను సందర్శించి రైతులందరూ కూడా వారితో నిమ్మ తోటను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
KDP: చెన్నూరు(మం) రుద్రభారతిపేటకు చెందిన దుర్గం దస్తగిరి(37) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దస్తగిరిని ఎవరైనా ఎక్కడైనా చూసి, సమాచారం తెలిసినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
MBNR: కాంగ్రెస్ పార్టీ 2023 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రత్యేక ఆటో బడ్జెట్ హామీని వెంటనే అమలు చేయాలని దేవరకద్ర ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు రాము డిమాండ్ చేశారు. ఈనెల16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని కోరారు. లేకపోతే ఆటో డ్రైవర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సభ్యులు రాజు, శేఖర్, నవీన్, కొండారెడ్డి, భీమాచారి తెలిపారు.
BHNG: గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను బొంధుగుల సర్పంచి పయ్యావుల ఎల్లయ్య గ్రామ పెద్దలు కోరారు. బుధవారం ఆయనను కలసి గ్రామంలోని సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, ఉపసర్పంచ్ అబిద్ వార్డు సభ్యుడు శీను, రమేష్, గ్రామస్తులు సిద్దులు, రాజు, రాములు, కిషన్, కనుకయ్య, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
NRPT: నార్త్ కరోలినాలో జూలై 17–19 జరగనున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (TATA) కాన్ఫరెన్స్‌కు మంత్రి వాకిటి శ్రీహరిని ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో టాటా ప్రతినిధుల బృందం ఆయనను కలిగి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.