• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘యోగ సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యం’

SDPT: యోగ సాధన ద్వారానే మానసిక, శారీరక ఆరోగ్యం సాధ్యమని మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, ధర్మవీర్ యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకురాలు ఐలేని అనిత అన్నారు. ధర్మవీర్ యోగ కేంద్రం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని ప్రత్యేక యోగాసనాలు చేయించారు. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అనేక రుగ్మతలకు యోగా ఒక్కటే సరైన పరిష్కారమన్నరు.

March 2, 2026 / 10:57 AM IST

దివంగత మాజీ స్పీకర్ కు ఎమ్మెల్యే ఘన నివాళి

SRD: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి కార్యక్రమం నేడు అసెంబ్లీ ఆవరణలో జరిగింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సికిందర్‌తో కలిసి, మాజీ స్పీకర్‌కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

March 2, 2026 / 10:56 AM IST

శ్రీకాకుళం జాతీయ రహదారిపై చిమ్మచీకటి

శ్రీకాకుళం జాతీయ రహదారి-16 పై రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ దీపాలు అన్నీ వెలగక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరుసగా ఉండే ఈ దీపాలలో మధ్య మధ్యలో కొన్ని పూర్తిగా వెలగడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో చీకటి అలముకుంటుంది. జాతీయ రహదారిపై లారీ చోదకులు కొన్నిచోట్ల సునకాలను ఢీ కొట్టడంతో అవి రోడ్డు మీదే ఉంటున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు వాపోతున్నారు.

March 2, 2026 / 10:53 AM IST

SFI టాలెంట్ టెస్ట్ నిర్వహణ

NRPT: జిల్లా కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో SFI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నరహరి, భాను ప్రకాశ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 10:51 AM IST

ఈపూరు తిరునాళ్ళ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

PLD: ఈపూరులో శ్రీ బోటిమీద ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లు ఆదివారం ఘనంగా జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 2, 2026 / 10:50 AM IST

వ్యవసాయ మార్కెట్‌ సెలవు వివరాలు ఇవే..!

JGL:హోలీ పండుగ సందర్భంగా మార్చి 2న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్, కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అలాగే కమిషన్ దారులు, ఖరీదారులు, కార్మికుల అభ్యర్థన మేరకు మార్చి 4న కూడా మార్కెట్ యార్డ్‌ను సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 5 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.సెలవు రోజుల్లో రైతులు సరుకులు తీసుకురాకూడదన్నారు.

March 2, 2026 / 10:47 AM IST

BREAKING: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి

TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స కోసం 5 రోజుల క్రితం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే, దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడుల నేపథ్యంలో విమాన సర్వీసులను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నప్పటికీ, ఎయిర్‌పోర్ట్ క్లియరెన్స్ వచ్చే వరకు భారత్ తిరిగి వచ్చే అవకాశం లేదు.

March 2, 2026 / 10:47 AM IST

జీడి రైతుల ఆందోళన.. రూ.200 ధర డిమాండ్

AKP: దేవరాపల్లి మండలం సమ్మెద గ్రామంలో జీడి రైతులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కిలోకు రూ. 200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 80 కేజీల బస్తాకు రూ.8,000 మాత్రమే ఇస్తుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర తెలిపారు. జీడికి ప్రత్యేక నిధి కేటాయించాలని కోరారు.

March 2, 2026 / 10:47 AM IST

సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన అభిమానులకు కీలక అప్‌డేట్ ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలోని ‘క్రిష్ 4’ను ప్రస్తుతానికి పక్కనపెట్టిన ఆయన, కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్‌’తో ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది హృతిక్ కెరీర్‌లోనే తొలి సౌత్ ఇండియన్ సినిమా. ఈ చిత్రం పూర్తయ్యాకే ‘క్రిష్ 4’ పట్టాలెక్కుతుందని సమాచారం.

March 2, 2026 / 10:47 AM IST

గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి ఫైర్

AP: గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా? అని ప్రశ్నించారు. ‘అడిగేవాళ్లు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారు. రామాయణ కాలం నుంచి ఆంధ్రా అనే పేరు ఉంది. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు. మా ప్రాంతం.. మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. ఎక్కడో ఉండి గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దు’ అని మండిపడ్డారు.

March 2, 2026 / 10:46 AM IST

శ్రీవారి సన్నిధిలో జడ్పీ ఛైర్‌పర్సన్

ELR: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష పూజా కైంకర్యాలు జరిపించారు. అలాగే స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

March 2, 2026 / 10:45 AM IST

పాక్ కెప్టెన్‌పై జర్నలిస్టులు ఫైర్

T20 WC నుంచి పాక్ వైదొలిగిన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ ఆఘాపై ఆ దేశ జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. లంక-ఆసీస్ సిరీసుల్లో మూడో స్థానంలో బాగా ఆడిన తను ఎందుకు టోర్నీలో అక్కడే ఆడలేదని, బాబర్ సేవలను ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోతున్నారని నిలదీశారు. జట్టులో ప్రతి నిర్ణయం కోచ్ మైక్ హెసన్ తీసుకుంటూ ఆఘాను డమ్మీ కెప్టెన్ చేశాడనీ మండిపడ్డారు.

March 2, 2026 / 10:43 AM IST

‘నిందితులను త్వరగా పట్టుకోవాలి’

SS: అగళి మండలంలోని శంకర లింగేశ్వర స్వామి ఆలయంలో వినాయకుడి విగ్రహం చోరీకి గురైన ఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కన్వీనర్లు, సింగిల్ విండో ప్రెసిడెంట్, పోలీసు అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 2, 2026 / 10:43 AM IST

‘ఎయిర్ పోర్ట్ వెళ్తున్నారా..? ఓ సారి కాల్ చేయండి’

HYD: మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న పరిస్థితులు, గగనతల పరిమితుల కారణంగా HYD శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నడిచే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు బయలుదేరే ముందు అధికారిక వెబ్‌సైట్ www.hyderabad.aero, కస్టమర్ కేర్ +914066546370 ద్వారా చెక్ చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 10:42 AM IST

పత్తికొండలో త్రయోదశి ప్రత్యేక పూజలు

KRNL: పత్తికొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా ఇవాళ నిర్వహించారు. పూజారి విజయ్ ఆధ్వర్యంలో నందీశ్వరుడు, రామలింగేశ్వరుడికి పంచామృత, పాలాభిషేకాలు చేశారు. అనంతరం పసుపు, కుంకుమ, గంధం, భస్మాలతో అర్చన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

March 2, 2026 / 10:42 AM IST