• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా శక్తి పై విద్యార్థులకు అవగాహన

AKP: నాతవరం ఎంపీపీ పాఠశాలలో సోమవారం మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా శక్తిపై విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు డ్రాయింగ్, డిబేట్ పోటీలు నిర్వహించి అనంతరం క్రీడా సామగ్రిని బహుమతులుగా అందజేశారు. మహిళా కానిస్టేబుల్ బీ.రాజేశ్వరి మహిళా శక్తి గురించి అవగాహన కల్పించారు.

March 2, 2026 / 12:23 PM IST

25 బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన బాణసంచా పేలుడు ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 22 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

March 2, 2026 / 12:21 PM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

MLG: గోవిందరావుపేట(M) పస్రాలోని అభ్యుదయ కాలనీలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో రవి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్రిజ్ ఇతర విలువైన వస్తువులు కూడా మంటల్లో బూడిదైపోయాయి. వెంటనే స్థానిక ప్రజలు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 12:21 PM IST

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..!

MDK: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 12:21 PM IST

సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 48, 49 డివిజన్ల పరిధిలో సుమారు రూ.9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని ఎమ్మెల్యే అన్నారు.

March 2, 2026 / 12:20 PM IST

‘శక్తి యాప్ ఉంటే ఒక పోలీస్ మీ వెంట ఉన్నట్లే’

SKLM: సెల్‌ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇది ఉంటే ఒక పోలీస్ మీ వెంట ఉన్నట్లేనని శక్తి టీం సభ్యులు గిరిధర్, గణేష్ తెలిపారు. సోమవారం సంతబొమ్మాలి జిల్లా పరిషత్ పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపదలో ఉన్న సమయంలో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బాబురావు పాల్గొన్నారు.

March 2, 2026 / 12:19 PM IST

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం

AP: సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. హెచ్.వడ్రహట్టి గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలతో సహా తల్లీకూతురు సుబ్బమ్మ, లక్ష్మీ అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుటుంబ వివాదాల కారణంగానే వారంతా అదృశ్యమైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

March 2, 2026 / 12:17 PM IST

‘కోల్‌కతా’ లేజర్ షో‌పై సన్నీ, రవిశాస్త్రి ఫైర్

IND vs WI మ్యాచ్ డ్రింక్ బ్రేక్ వేళ కోల్‌కతా మైదానంలో లేజర్ షో నిర్వహించడంపై దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి మండిపడ్డారు. లేజర్ లైట్ వల్ల బ్యాటర్లకు ఇబ్బంది కలుగుతుందని, T20 WC వంటి కీలక వేదికపై మ్యాచ్ మధ్యలో ఇలాంటి వినోదం అవసరమా అని ప్రశ్నించారు. IPL టోర్నీ మధ్యలో అయితే ఓకే కానీ నాకౌట్స్‌లో ఇది సరికాదని సూచించారు.

March 2, 2026 / 12:17 PM IST

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం

ASF: కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్- 2026’ జిల్లా స్థాయి పోటీలు మార్చి 5న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కే.శ్రీదేవి సోమవారం తెలిపారు.18 నుంచి 25 ఏళ్ల యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు-భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు అంశంపై 3 నిమిషాల ప్రసంగం చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

March 2, 2026 / 12:17 PM IST

భక్తులతో కిటకిటలాడిన ధర్మపురి క్షేత్రం

JGL: ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అనుబంధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గోదావరి నదిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు. భక్తులు తల పై కొబ్బరి, బెల్లాలు పెట్టుకుని వచ్చి స్వామి వారికి సమర్పించారు. భక్తులు శ్రద్దలతో పూజలు జరిపి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

March 2, 2026 / 12:16 PM IST

మూగి తాతను దర్శించుకున్న ఎంపీ

KRNL: దేవనకొండ మండల కేంద్రంలోని దివానే మూగి తాత ఉరుసు సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్గాను ఇవాళ సందర్శించారు. దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 12:15 PM IST

ఎమ్మెల్సీ అంజిరెడ్డికి బీజేపీ నాయకుల వినతి

JGL: కోరుట్ల ప్రాంతానికి చెందిన బీజేపీ మల్లాపూర్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చిన్నమలై అంజిరెడ్డిని హైదరాబాద్లో సోమవారం కలిశారు. మల్లాపూర్ మండలంలోని అనారోగ్య బాధితుల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు అందజేశారు. గొర్రెపెల్లి, గుండంపెల్లి, మొగిలిపేట్ పాఠశాలలకు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు.

March 2, 2026 / 12:14 PM IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి

ADB: ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బేల మండలంలో చోటుచేసుకుంది. సోమవారం మండలంలోని వరూర్ గ్రామంలో తన వ్యవసాయ భూమిలో వెంకట్ రావు(60) మృతిచెంది కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసుకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.

March 2, 2026 / 12:14 PM IST

విద్యార్థులను అభినందించిన పాఠశాల HM

BHPL: గత నెలలో నిర్వహించిన TCC లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్షల్లో మహదేవపూర్ ZPHS ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఏడుగురు విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. చదువుతో పాటు కళాత్మక రంగాల్లో రాణించడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 2, 2026 / 12:13 PM IST

విశాఖలో యువకుడి ఆత్మహత్య

VSP: కూర్మన్నపాలెం సమీపంలో గల మంగళపాలెం జెఎన్ఎమ్ఎర్ దగ్గర టిట్కో ఇంట్లో సోమవారం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేయడానికి ఒడిశా నుంచి వచ్చిన అభినాష్ ప్రధాని (21) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 12:13 PM IST