AKP: కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశం ఈనెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచ్‌లను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. అలాగే అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.
ADB: నార్నూర్ మండలంలోని ఎంపల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైనే చేరి తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు నిల్వ ఉండటంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారి రహదారులు నడవలేని స్థితికి చేరుతుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కొరారు.
RR: చౌదరిగూడపరిధిలోని ఓ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్‌ను MEO స్టేటస్ పెట్టడాన్ని ఖండిస్తున్నామని SFI RR జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిప్యూటేషన్ పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూలుకు MEO వత్తాసు పలికితే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా నమ్ముతారన్నారు. MEOపై చర్యలు తీసుకోవాలన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మంగళవారం చంద్రగ్రహణం కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ఈవో రమణారెడ్డి సమక్షంలో ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలను మూసి ముద్ర వేశారు. రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
NRML: నిర్మల్ పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన హోలీ వేడుకల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పాల్గొన్నారు. పోలీసు సిబ్బందికి, అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితం రంగుల మయంగా ఉండాలని ఈ పండుగ అందరి జీవితాల్లో రంగులు పూయాలని తెలిపారు.
MBNR: గండీడ్ మండల కేంద్రంలోని రైతువేదికలో ఏవో జీ. రాధమ్మ ఆధ్వర్యంలో ఆత్మ సహకారంతో వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు జరిగింది. ఏఈవోలు సమత, వరలక్ష్మి, శివలీల, గౌతమి పాల్గొని పంటల దిగుబడి పెంపు, ఎరువుల సమతుల్య వినియోగం, వ్యాధి నియంత్రణపై సూచనలు ఇచ్చారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నేడు. ప్రకృతి సమతుల్యతలో మూగజీవాల పాత్ర వెలకట్టలేనిది. అడవుల నరికివేత, వేట వల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. మన మనుగడ వన్యప్రాణుల రక్షణపైనే ఆధారపడి ఉంది. భూమిపై ఉన్న ప్రతి జీవిని గౌరవిద్దాం, అడవులను కాపాడుకుందాం. భావి తరాలకు పచ్చని ప్రకృతిని అందిద్దామని ఈరోజు ప్రతిజ్ఞ చేద్దాం. వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత.
TG: హోలీ పండుగను ఆసరాగా చేసుకని సైబర్ నేరగాళ్లు మోసలకు పాల్పడుతున్నారు. రంగులు, గిఫ్ట్ వోచర్లు, హోలీ ఈవెంట్ పాస్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMS, సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులను పంపిస్తున్నారు. అయితే ఈ లింకులపై క్లిక్ చేస్తే స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వడమే కాకుండా, బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
SKLM: బూర్జ (M) కొరగాం గ్రామంలో కుక్కల దాడిలో పి. వెంకటరమణకు చెందిన 12 గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. గుంపుగా వచ్చిన కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయని తెలిపారు. అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
KMM: యాసింగి పంటల సాగుకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా అందివ్వాలని సీపీఎం మండల నాయకులు పొన్నం వెంకటరమణ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘం, సీపీఐ(యం) ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో నిరసన చేపట్టారు. యాసింగి సమయం అయిపోతున్నా ఇప్పటివరకు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు.
MHBD: తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన దాసరి వెంకట్ రెడ్డి సాగు భూమి ఎస్సారెస్పీ డీబీఎం -57 కెనాల్ పక్కనే ఉంది. సాధారణంగా కెనాల్‌కు ఇరువైపులా రాకపోకలకు దారి ఉండాలి. కానీ ప్రస్తుతం ఒకవైపు మాత్రమే ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. తన పొలానికి వెళ్లాలంటే కెనాల్ కాలువ దూకాల్సి వస్తుందన్నారు.
AP: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలంలోని బొబ్బిల్లంకలో ఓ వ్యక్తి తన భర్య, అత్తను కత్తితో నరికి చంపాడు. సీతారామరాజు, లత దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లత తన తల్లి లక్ష్మి ఇంట్లో ఉంటోంది. అత్తగారింటికి వెళ్లిన సీతారామరాజు.. లత, లక్ష్మిలను కిరాతకంగా నరికి చంపాడు. భార్యపై అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు.
VZM: గంట్యాడ మండలం బోనంగి శివారులో నెలకొన్న అపరిశుభ్రత పరిస్థితి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని గ్రామస్థులు మండిపడుతున్నారు. చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తున్నా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
SDPT: కోహెడ మండలంలోని పలు గ్రామాలలో హోలీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గ్రామాలన్నీ రంగుల హరివిల్లుగా మారగా, చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామాల్లో పండుగ సందడి, హర్షోత్సాహాలు వెల్లివిరిశాయి.