MBNR: జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు వన్ టౌన్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం జరిగింది. ఇన్స్‌స్పెక్టర్ అప్పయ్య వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రాణహానికరమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సీనయ్య, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
KRNL: పెద్దకడబూర్ మండలంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ శనివారం పర్యటించారు. దళిత గిరిజనుల సమస్యలను తెలుసుకుని, మాదిగలపై హత్యలు, దాడులు ఆపాలని అయన కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాల కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, యువత పాల్గొన్నారు.
W.G: పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్ పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు.
TPT: గూడూరు మునిసిపాలిటీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మొదలైంది. నెల్లటూరు సచివాలయ ఉద్యోగిని వాత్సల్య ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ మైనింగ్ సర్దార్ సంజీవ రెడ్డి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ అత్యంత నైపుణ్యం కలిగిన ఇలాంటి సీనియర్ మైనింగ్ సర్దార్ పదవీ విరమణ చేయడం సంస్థకు తీరని లోటన్నారు. ఆయన అనుభవం, పని పట్ల ఆయనకున్న అంకితభావం నేటి యువ కార్మికులకు ఒక గొప్ప పాఠమన్నారు.
చాలామంది పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల రాత్రిళ్లు తక్కువ సమయం నిద్రపోతున్నారు. రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతూ, తాము ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారు. కానీ అది కేవలం వారి భ్రమ మాత్రమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండు వారాలు చేస్తే.. రెండు రోజుల పాటు నిద్ర లేని వ్యక్తి మెదడు ఎలా పనిచేస్తుందో, అంతటి ప్రమాదకర స్థితికి చేరుకుంటుందట.
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని పాత ముగ్ధంపురం గ్రామానికి చెందిన నలుమస వంశి (23) శనివారం తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాయపడిన యువకుడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
PLD: నరసరావుపేట క్రిస్టియన్‌పాలెంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు.. రౌడీషీటర్లు, పాత నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 బైకులు, 2 ఆటోలతో పాటు కత్తులు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
NZB: జిల్లా ఆయుష్ విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ జే. గంగాదాస్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాధాకృష్ణ పాఠశాల, ఆర్యసమాజ్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అనిత, సునీత, ఫార్మాసిస్ట్‌లు పురుషోత్తం, ఉమాప్రసాద్, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేపట్టినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగా అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివాస స్థల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. బాధితులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని సూచించారు.
తమిళ దర్శకుడు రా. కార్తీక్‌తో అక్కినేని నాగార్జున తన 100వ మూవీ చేస్తున్నారు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ మైసూర్‌లో స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 2 వారాలకు పైగా సాగే ఈ షెడ్యూల్‌లో నాగ్‌తో పాటు కీలక సన్నివేశాలపై చిత్రీకరణ జరగనున్నట్లు టాక్. ఇక 2026 ద్వితీయార్ధంలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ఎండాకాలం చల్లదనం కోసం పానీయాలు సేవించటం కామన్. వంటికి చలువచేసే తర్బూజ్ సైతం తెగ తినేస్తుంటాం. దీంతో ఎండాకాలం ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఫిబ్రవరిలోనే HYD శివారు బాటసింగారం మార్కెట్‌లో డిమాండ్ షురూ అయింది. మొన్నటి వరకు కిలో రూ.30 పలుకగా ఇవాళ రూ. 35 నుంచి రూ. 40 వరకు చేరింది. ఇక మార్చి నెలలో తర్బూజ్ మామకు మరింత డిమాండ్ ఏర్పడనుంది.
TG: మఠాన్ని కూల్చడమంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకపేట నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠాన్ని హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో పేదలు ఉంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు.
CTR: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని గ్రామాలలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు గ్రామస్తులతో సంభాషించి ధైర్యం-స్పర్శ, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, సైబర్ నేరాల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాల నివారణపై మార్గ నిర్దేశం చేశారు.
BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి GM కార్యాలయంలో ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ యూనియన్‌తో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ కవింద్ర హాజరై మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు తదితరులు ఉన్నారు.