• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేత

RR: చంద్రగ్రహణం సందర్భంగా రేపు ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని రామేశ్వరం గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుందన్నారు. ఆలయంలో సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం, అభిషేకాలకు అనుమతి ఉంటుందన్నారు.

March 2, 2026 / 11:31 AM IST

రేపు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేత

SDPT: చంద్రగ్రహణం సందర్భంగా బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని మంగళవారం తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. గ్రహణం దృష్ట్యా ఉదయం 6 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేస్తామని పేర్కొన్నారు. తిరిగి ఎల్లుండి (4వ తేదీ) ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

March 2, 2026 / 11:30 AM IST

రాధాకాంత స్వామి ఆలయం వద్ద కామదహనం

SKLM: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాధాకాంత స్వామివారి డోలోత్సవాలు మార్చి 1- 3వరకు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామ దహన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం కమిటీ నిర్వాహకులు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ముందుగా ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తిరువీధి కార్యక్రమం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

March 2, 2026 / 11:29 AM IST

మొరాయించిన ఉపాధి హామీ యాప్.. వెనుదిరిగిన కూలీలు

KMR: నాగిరెడ్డిపేటలోని జప్తి జానకంపల్లి, వదలపర్తి, పోచారం గ్రామాల్లో నేడు ఉపాధి హామీ కూలీలకు చుక్కెదురైంది. ఉదయాన్నే పని ప్రదేశానికి చేరుకున్న కూలీలకు హాజరు వేసే మొబైల్ యాప్ పనిచేయలేదు. ఫోటో క్యాప్చరింగ్ విధానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎంత ప్రయత్నించినా హాజరు నమోదు కాలేదు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన హాజరు పడకపోవడంతో నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లారు.

March 2, 2026 / 11:29 AM IST

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత

NLG: నెర్మటకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. వెంకన్న చేరికతో నెర్మటలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తానని వెంకన్న తెలిపారు.

March 2, 2026 / 11:28 AM IST

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

JN: చిల్పూర్ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 8 రోజులుగా భక్తుల రద్దీ మధ్య వైభవంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా హోమాలు, బలిహరణం,మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం వంటి విశేష సేవలు జరిగాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 2, 2026 / 11:27 AM IST

అయినవిల్లి విఘ్నేశ్వరుని సేవలో శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించే ఆయనకు వేద ఆశీర్వచన అందజేశారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.

March 2, 2026 / 11:27 AM IST

‘అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దు’

VZM: బాణసంచా నిల్వ, తయారీ, విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో హోల్సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దని, షాపులు-గోడౌన్ల వద్ద ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫైర్ అలారమ్స్, సురక్షిత వైరింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

March 2, 2026 / 11:27 AM IST

చిరుత దాడిలో దూడ మృతి..!

CTR: చౌడేపల్లి మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు గిరి తన పశువుల మేత కోసం గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో తోలుకెళ్లాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం పెద్ద వక్కిరి వద్ద పశువులు మేత మేస్తుండగా చిరుత దాడి చేసినట్లు రైతు తెలిపాడు. ఈ దాడిలో దూడ మృతి చెందినట్లు వాపోయాడు.

March 2, 2026 / 11:27 AM IST

రాజకీయాల్లో దుద్దిళ్ల శ్రీపాద రావుది ప్రత్యేక చరిత్ర

SRCL: తెలుగు రాజకీయాల్లో దుద్దిల్ల శ్రీపాదరావుది ప్రత్యేకమైన చరిత్ర అని, ప్రభుత్వ విప్ విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 89 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు‌తో కలిసి ప్రభుత్వ విప్ పాల్గొన్నారు.

March 2, 2026 / 11:26 AM IST

గుత్తిలో పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

ATP: గుత్తిలోని 4 కేంద్రాల్లో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి సంవత్సరం గణితం పరీక్ష కావడంతో సప్లమెంటరీ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోలీసులు, కళాశాల సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 11:26 AM IST

అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు

BDK: టేకులపల్లి మండలం హరిజనవాడలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం పర్యటించారు. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. విడతల వారీగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు.

March 2, 2026 / 11:26 AM IST

కేసీ కెనాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరిధిలోని కేసీ కెనాల్లో ఆదివారం గల్లంతైన ఒంగోలుకు చెందిన హేమంత్ (17) మృతదేహం సోమవారం ఈర్నపాడు సమీపంలో లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 11:25 AM IST

నిర్మల్ పట్టణంలో హోలీ సందడి

NRML: రేపు జరగనున్న హోలీ పండగ నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.రంగులు, పిచికారీలు,మిఠాయిల కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు.ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలతో దుకాణాలు సిద్ధమయ్యాయి.పండగ సమీపిస్తున్న వేళ పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.

March 2, 2026 / 11:23 AM IST

యుద్ధానికి సిద్ధం కండి: రాహుల్ గాంధీ

TG: రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఇండో-అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరమని, మోదీ చర్యల వల్ల ఇండియాలో యుద్ధం వచ్చే ముప్పు ఉందని ఆరోపించారు. ఇరాన్ వంటి పరిస్థితులు మనకు రావొద్దని, మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు కోసం అందరూ యుద్ధానికి సిద్ధం కావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 2, 2026 / 11:22 AM IST