• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హిందూమత విధ్యంసానికి కుట్ర చేశారు: మంత్రి ఆనం

AP: తిరుమల లడ్డూ అంశంపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీటీడీ విషయంలో వైసీపీ నేతలు మహాపాపం చేశారు. కల్తీ నెయ్యి కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడ్డారు. సీబీఐ ఛార్జిషీట్‌లో 36 మందిని నిందితులుగా చేర్చారు. హిందూమత విధ్యంసానికి కుట్ర చేశారు’ అని ఆయన ఆరోపించారు.

March 5, 2026 / 02:25 PM IST

గణితంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

WNP: పదో తరగతి విద్యార్థులు గణితంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించారు.

March 5, 2026 / 02:25 PM IST

యువకుడు అదృశ్యం.. కేసు నమోదు

KDP: మైదుకూరు చెందిన మారుతి కుమారుడు మహిధర్ (25) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల కిందట పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంతకు రాకపోవడం, బంధువులు దగ్గర లేకపోవడంతో తండ్రి మారుతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మంగారిమఠంలో సంచారం చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

March 5, 2026 / 02:24 PM IST

డ్రోన్ సేవలను ప్రారంభించిన కలెక్టర్

HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

March 5, 2026 / 02:24 PM IST

సెన్సస్ శిక్షణ మూడవ రోజు నిర్వహణ

TPT: జిల్లా స్థాయి సెన్సస్ శిక్షణ కార్యక్రమంలో మూడవ రోజు సెన్సస్ ప్రాముఖ్యత, ప్రతి వ్యక్తిని ఖచ్చితంగా లెక్కించే అవసరం, డిజిటల్ విధానం, కుల సెన్సస్‌పై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర జనగణన కార్యకలాపాల డైరెక్టర్, పౌర నమోదు డైరెక్టర్ జే. నివాస్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పాల్గోన్నారు.

March 5, 2026 / 02:23 PM IST

ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: అమరావతిలోని శాసనసభ ప్రీ విలేజ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ప్రీ విలేజ్ కమిటీ అధ్యక్షులు పి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. శాసనసభ హక్కులు, సభ్యుల బాధ్యతలు, కమిటీ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 5, 2026 / 02:22 PM IST

సిబిల్ స్కోరు పేరుతో సైబర్ మోసాలు జాగ్రత్త

సోషల్ మీడియాలో వచ్చే సిబిల్ స్కోరు పెంచుతామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ స్కోరు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారు డబ్బు వసూలు చేస్తారు. నిజానికి సిబిల్ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పాత బాకీలు, ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తేనే స్కోరు పెరుగుతుంది తప్ప, ఎవరూ డబ్బుతో స్కోరును పెంచలేరని గ్రహించి అప్రమత్తంగా ఉండాలి.

March 5, 2026 / 02:20 PM IST

ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ

KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె రాముడు భార్య వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని స్పష్టం చేశారు.

March 5, 2026 / 02:20 PM IST

పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి భరోసా: ఎమ్మెల్యే

GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో పెళ్లిళ్ల భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

March 5, 2026 / 02:19 PM IST

ఆలేరు పట్టణ ప్రభుత్వ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ

BHNG: జిల్లా నూతన కలెక్టర్‌గా నియామకమైన అనురాగ్ జయంతి ఆలేరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్, అభివృద్ధికి తోడ్పడుతామన్నారు.

March 5, 2026 / 02:18 PM IST

ఈనెల 9న కాకినాడలో ప్రైమ్ మినిస్టర్ అప్రెంటిస్ మేళా

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వివిధ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల కాకినాడలో ఈనెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94404-08182 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

March 5, 2026 / 02:17 PM IST

అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తాం: మంత్రి

KDP: ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 62 ఏళ్లు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంగన్‌వాడీల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. అసెంబ్లీలో ఈ అంశంపై MLAలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.గతంలో అంగన్‌వాడీలకు జీతం రూ.4200 ఉండేదని..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాన్ని రూ.11,500కు పెంచామన్నారు.

March 5, 2026 / 02:17 PM IST

రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన AMC ఛైర్మన్

E.G: గోపాలపురం నియోజవర్గంలోని పోతవరం నుంచి జి.కొత్తపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నియోజకవర్గ AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. MLA మద్దిపాటి వెంకటరాజు సహకారంతో రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు.

March 5, 2026 / 02:17 PM IST

అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన వేడుకలు

NRPT: పట్టణంలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు కల్పన, ప్రభాకర్ రాజేష్ ఘట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు గుడ్లు, బాలమృతం, పంపిణీ చేసి గర్భిణిలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.

March 5, 2026 / 02:17 PM IST

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

VSP: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. స్థానిక మస్తరు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ మేస్త్రీలు, రూట్ సూపర్వైజర్లు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించారు.

March 5, 2026 / 02:15 PM IST