• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వాజేడు MPDO కార్యాలయ సూపర్డెంట్ మృతి

MLG: వాజేడు MPDO కార్యాలయంలో సూపర్డెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర ఉమారాణి (52) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె స్వగృహంలోనే కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఎంపీడీవో, సంబంధిత అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

February 28, 2026 / 01:30 PM IST

పౌర హక్కుల దినోత్సవం.. ప్రజల వద్దకే అధికారులు

SRPT: నేరేడుచర్ల మండలం వైకుంఠాపురం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల హక్కులకు భంగం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తుల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని, తక్షణ పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ భవాని, అధికారులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:30 PM IST

కాజీపేట చౌరస్తాలో brs ఆధ్వర్యంలో ధర్నా

TG: వరంగల్ జిల్లా కాజీపేటలో ‘కొలువుల కోసం కొట్లాట’ పేరిట BRS ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

February 28, 2026 / 01:28 PM IST

ఇరాన్ వదిలేయండి: చైనా పౌరులకు హెచ్చరిక

ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, ఇరాన్‌లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని, ఎవరూ కొత్తగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచింది. ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తోన్న విషయం తెలిసిందే.

February 28, 2026 / 01:28 PM IST

పెన్షన్ లబ్ధిదారుల సమస్యలు తెలుసుకున్న MLA

BPT: చీరాల నియోజకవర్గవ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం, ఈపురుపాలెం ప్రాంతాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 01:27 PM IST

పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన

SKLM: కోటబొమ్మాలి మండలం పట్టు పురం పంచాయతీలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు పట్టు పురం బీటి రోడ్ నుంచి మణి నాగేశ్వరపురం వరకు రూ.1 కోటితో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టుపురంలో రూ. 28 లక్షలతో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

NRML: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా భైంసా పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను శనివారం జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించే భాగంలో తనిఖీ నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ తనిఖీలలో ప్లయింగ్ స్క్వాడ్ రవీందర్,డిఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

SRCL: చందుర్తి మండలం సనుగుల ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా ఇన్ ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ .. భారతీయ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1928లో కనుగొన్న రామన్ ఎఫెక్ట్‌కు గౌరవంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.

February 28, 2026 / 01:27 PM IST

‘ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవాలి’

VZM: ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవ రచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ DVG శంకర్‌రావు అన్నారు. కామాక్షి నగర్‌లో జాతీయ సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ఆవిష్కుతమైన నేపథ్యంలో మనదేశంలో ఇవాళ జాతీయ విజ్ఞాన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

February 28, 2026 / 01:26 PM IST

గచ్చిబౌలి స్టేడియం ముందు అధ్వానం

HYD: అంతర్జాతీయ స్థాయి క్రీడలకు నిలయమైన గచ్చిబౌలి స్టేడియం ముఖద్వారం వద్దే అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద వెలుస్తున్న అక్రమ ఫుడ్ స్టాల్స్ కారణంగా ఆ ప్రాంతమంతా అధ్వానంగా తయారవుతోంది. దీనిపై స్థానిక క్రీడాకారులు, నగరవాసులు సైబరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు.

February 28, 2026 / 01:26 PM IST

రూ.4 వేల వ్యాక్సిన్.. ఫ్రీగా ఇస్తున్నాం: చంద్రబాబు

AP: సర్వైకల్ క్యాన్సర్ నివారణలో HPV వ్యాక్సిన్ కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్‌కు రూ.4 వేల ఖర్చవుతుందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఖర్చును భరించేందుకు ముందుకొచ్చారని అన్నారు. ఆహారపు అలవాట్లతోనే క్యాన్సర్ ముప్పు పెరుగుతోందన్నారు.

February 28, 2026 / 01:24 PM IST

చిల్లకూరులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

TPT: చిల్లకూరు అపెక్స్ ఫుట్ వేర్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జాతీయ రహదారి పక్కన చెరువులోకి వెళ్లే కాలువ నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 01:22 PM IST

ఎస్సీ కమ్యూనిటి హాల్ నిర్మాణానికి భూమి పూజ

ADB: గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. ముత్నూర్ గ్రామస్తుల కోరికలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ కరుణ భీంరావ్ నాయాక్. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుమల్ ఉన్నారు.

February 28, 2026 / 01:22 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: కనేకల్లు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం ప్రారంభిoచారు. పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల సరైన నిర్వహణ, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజల సహకారంతో కనేకల్లు మండలాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుకుందాం అని ఆయన కోరారు.

February 28, 2026 / 01:21 PM IST

ధ్వజారోహణం కార్యక్రమంలో ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి మండలంలోని శ్రీమత్‌ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వద్ద నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 01:20 PM IST