• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

ELR: కైకలూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్లేటి కోటలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఉత్సవ నిర్వహణ కొరకు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 03:23 PM IST

రోడ్డు ప్రమాదం దంపతులకు తీవ్ర గాయాలు

WNP: బుద్ధారం గండి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రేవల్లి మండలంలోని చిరుకపల్లికి చెందిన పోతుల కేశవులు, వనజ దంపతుల బైక్‌‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవులకు తల గాయంతో పాటు కాలు ఫ్రాక్చర్ అవ్వగా, భార్యకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో వారిని మహబూబ్‌ నగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 03:20 PM IST

రాజకీయం శాశ్వతం కాదు.. అభివృద్ధి నా లక్ష్యం: మాజీ MLA

ప్రకాశం: మాజీ MLA అన్నా రాంబాబు మార్కాపురం YCP కార్యాలయంలో మాట్లాడారు. జులై 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని CM ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మీరు చెప్పిన విధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ ప్రాంత ప్రజానీకమంతా రాజకీయంగా మీ వెంట ఉంటామని పేర్కొన్నారు. రాజకీయం శాశ్వతం కాదు.. మా ప్రాంతం అభివృద్ధి చెందడం నా లక్ష్యమని ఆయన తెలిపారు.

February 27, 2026 / 03:20 PM IST

క్వింటా పత్తి ధర ఎంతంటే.?

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ఈ వారం మొదటిరోజుతో పోలిస్తే ఈరోజు పత్తి ధర కాస్త పెరిగింది. ఈ వారం మొదటిరోజు క్వింటా పత్తి ధర రూ. 7545 ధర పలకగా.. మంగళవారం రూ. 7,510 అయింది. బుధవారం రూ. 7,515 ధర రాగా..గురువారం రూ. 7,550 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ. 7,555 అయిందని అధికారులు తెలిపారు.

February 27, 2026 / 03:19 PM IST

పరీక్షలకు ఎంతమంది గైర్హాజరు అయ్యారంటే.?

ASF: కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 13 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో 200 మందికి గాను 195 మంది హాజరు కాగా, ఐదుగురు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 114 మందికి, 106 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 03:18 PM IST

సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై అవగాహన

KMR: మాచారెడ్డి జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు కళా బృందం వారు విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులు, చట్టాల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

February 27, 2026 / 03:18 PM IST

పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

SRPT: అనంతగిరి మండలంలోని మొగ్గులాయకోట గ్రామ శివారులో వెంకట సాయి, కేఎన్ఆర్ గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామరావు సమక్షంలో గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు తమ సానుకూల, వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించారు.

February 27, 2026 / 03:18 PM IST

రేపు డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.!

మెదక్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్, సింధుజ మైక్రో క్రెడిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. 18 రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం కనీసం ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 27, 2026 / 03:15 PM IST

‘విష్ణు విన్యాసం’ రివ్యూ&రేటింగ్

జాతకాలు, వాస్తును నమ్మే జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీవిష్ణు).. రెండు పెళ్లిళ్ల దోషంతో అవమానాలు పడే మనీషా (నయన్ సారిక) మధ్య సాగే వినోదాత్మక చిత్రమిది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ, టైమింగ్‌తో అదరగొట్టాడు. యువతను మెప్పించే మీమ్ కంటెంట్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ సీన్లు మూవీకి ప్లస్. రొటీన్ కథ, ఊహించినట్లే సాగే స్క్రీన్ ప్లే మూవీకి మైనస్. రేటింగ్:2.5/5.

February 27, 2026 / 03:12 PM IST

చివరకు న్యాయం గెలిచింది: కేటీఆర్

TG: లిక్కర్ స్కాం కేసులో CBI కోర్టు ఇచ్చిన తీర్పుపై KTR స్పందించారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం పేరుతో కూల్చివేశారన్నారు. BRS ఓటమికి కూడా ఇది ఒక కారణమన్నారు. కవితకు కోర్టులో న్యాయం జరిగిందన్నారు. తమ నాయకులపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. చివరకు న్యాయం గెలుస్తుందన్నారు.

February 27, 2026 / 03:12 PM IST

ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

అన్నమయ్య: 1 వ తరగతి ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట MEOలు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. అందుకు సంబంధించి ప్రచార కరపత్రాలను శుక్రవారం వారు విడుదల చేశారు. అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని గ్రామ సచివాలయంలో, మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

February 27, 2026 / 03:11 PM IST

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

WG: ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 03:10 PM IST

పేదల ఆరోగ్యానికి భరోసా CMRF: MLA

KDP: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 54.81 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:10 PM IST

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధివే లక్ష్యం

KRNL: ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి రూపకల్పనలో అంగస్కల్ గ్రామంలో పోస్టర్ల ప్రచార కార్యక్రమం ఇవాళ ఉత్సాహంగా నిర్వహించారు. ఆలూరు కన్వీనర్ కటారికొండ శ్రీనివాసులు నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో కొమ్ము రాజు,సోమశేఖర్ పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఆలూరు భవిష్యత్తును మార్చడమే లక్ష్యమని తెలిపారు.

February 27, 2026 / 03:10 PM IST

ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం

KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ పంచాయితీలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిపించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో AEO వెంకట్, సర్పంచ్ ముద్దం నగేష్, రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 03:09 PM IST