• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎల్లారెడ్డి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు రమేశ్, అబ్దుల్ నబీ ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు నిర్వహణ, గదుల ఏర్పాటు, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

March 2, 2026 / 03:39 PM IST

‘పెద్ది’ సెకండ్‌ సింగిల్‌కు టైమ్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ‘చికిరి’ పాట రిలీజై సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రాయ్ రాయ్ రారా’ అంటూ సాగే లిరికల్ వీడియోను ఈరోజు రాత్రి 7:02 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.

March 2, 2026 / 03:39 PM IST

కట్ర్యాలలో ఐచర్ ట్రాక్టర్ చోరీ

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఐషర్ 380 ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు సయ్యద్ కరీం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ను వెతికేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

March 2, 2026 / 03:39 PM IST

ఎస్పీ కార్యాలయంలో PGRSకు 45 ఫిర్యాదులు

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ 45 ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా మోసపూరిత లావాదేవీలు, భూ తగాదాలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.

March 2, 2026 / 03:38 PM IST

పట్టపగలే కాలుతున్న గుట్ట

BDK: అశ్వాపురం మండల పరిధిలో గల అతి పెద్ద గుట్ట అయిన తుమ్మల చెరువు, కుర్వపల్లి కొత్తూరు గుట్ట పట్టపగలే అగ్నికి ఆహుతి అవుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. సంబధిత శాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకుని పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించాలని సోమవారం మండల ప్రజలు కోరారు. మూగ జీవాలు ఈ ప్రమాదాల వల్ల నష్టపోయే అవకాశ ఉందని తెలిపారు.

March 2, 2026 / 03:38 PM IST

PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

March 2, 2026 / 03:36 PM IST

సీనియర్ సిటిజన్ కార్డుల మంజూరు నిలిపివేత

MNCL: మంచిర్యాల జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆధార్ కార్డు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 03:36 PM IST

సింగరకొండ రథోత్సవానికి 650 మంది పోలీసుల భద్రత

ప్రకాశం: సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

March 2, 2026 / 03:35 PM IST

అర్జీలు స్వీకరించిన జేసీ

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

March 2, 2026 / 03:34 PM IST

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

NGKL: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 43 ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 03:34 PM IST

T20 WCలో రేపే తొలి సెమీఫైనల్

T20 WCలో రేపు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

T20 WC తొలి సెమీఫైనల్: SA vs NZ

T20 WCలో ఈనెల 4న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటివరకు ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. దీంతో ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే, కివీస్ జట్టుతో పోలిస్తే ప్రస్తుతం సఫారీ జట్టు బలంగా కనిపిస్తోంది.

March 2, 2026 / 03:34 PM IST

కర్తవ్యం వర్సెస్ కన్నీరు ఒక ఎస్సై భావోద్వేగ పోరాటం

KMM: సాధారణంగా ఖాకీ చొక్కా వెనుక కఠినత్వం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ యూనిఫామ్ వెనుక కూడా ఒక స్పందించే గుండె ఉంటుందని నిరూపించే దృశ్యం ఇది. ఒక మహిళ ఎంతో ఆవేదనతో తన గోడును వెళ్లగక్కుతుంటే, అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఆమె బాధను చూసి చలించిపోయారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.

March 2, 2026 / 03:32 PM IST

ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఇరుకు దారి విస్తరణ కోసం పంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. పురాతన ఇళ్లను ఈ క్రమంలోనే ఆదివారం కూల్చివేశారు. కానీ, అదే మార్గంలో ఉన్న బడా బాబుల ఇండ్లను కూలుస్తారా లేదా అనే ప్రశ్నలను ప్రజలు లేవనెత్తుతున్నారు. సమన్యాయం పాటించాలని, ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

March 2, 2026 / 03:32 PM IST

మందుగుండు తయారీ కేంద్రం సీజ్

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని శ్రీ వేమ శివ గణేష్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ని సోమవారం రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాలతో మందు గుండు తయారు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు వీఆర్వో సత్య నాగ శివ భాస్కర్ తెలిపారు.

March 2, 2026 / 03:31 PM IST