• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ విప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ

SRCL: వేములవాడ సబ్ డివిజన్ డీఎస్పీగా నియమకమైన శ్రీనివాసులు మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి, వేములవాడ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బదిలీపై వచ్చారు. మంగళవారం బాధ్యతల స్వీకరించిన అనంతరం శ్రీనివాసులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను కలిశారు.

March 3, 2026 / 03:00 PM IST

లక్ష్మిపాలెంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

KDP: బద్వేల్(మం) లక్ష్మిపాలెంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మిపాలెం మాడవీధుల్లో స్వామివారికి ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 3, 2026 / 02:57 PM IST

‘పండగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి’

NZB: ధర్పల్లి మండలంలో ఉగాది, రంజాన్ పండుగలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సామా శ్రీనివాస్ మంగళవారం సూచించారు. పండుగలు మత సామరస్యాన్ని చాటేలా ఉండాలని, ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా గడపాలని కోరారు. జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

March 3, 2026 / 02:56 PM IST

పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి: రాం ప్రదీప్

NTR: ప్రతి విద్యార్థి పరీక్షలలో ప్రశ్నాపత్రాన్ని 15 నిమిషాలు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాస్తే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాం ప్రదీప్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మునుకుళ్ళలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 3, 2026 / 02:55 PM IST

నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడటం ఎలా?

కొన్నిసార్లు నెగెటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.

March 3, 2026 / 02:54 PM IST

నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడటం ఎలా?

కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచనలు మనల్ని తీవ్రంగా వేధిస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి మనసును ఇతర మంచి విషయాలపై మళ్లించడం చాలా ముఖ్యం. నచ్చిన సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, ఇష్టమైన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కుదరకపోతే ధ్యానం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే తృప్తి, సానుకూల దృక్పథాన్ని నింపి, మిమ్మల్ని మళ్లీ కొత్త ఉత్సాహంతో నింపుతుంది.

March 3, 2026 / 02:54 PM IST

అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను సమర్పించాలి: కలెక్టర్

కోనసీమ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల ప్రణాళికను అధికారులు సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష చేశారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ప్రథమ స్థాయిలో నిలపాలన్నారు.

March 3, 2026 / 02:52 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

కృష్ణా: పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన గొరిపర్తి బసవయ్య అనే లబ్ధిదారుడికి వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ. 1,79,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

March 3, 2026 / 02:52 PM IST

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

కృష్ణా: పమిడిముక్కల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో రైతులకు 278 కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 19 నెలల కాలంలో రైతుల ప్రగతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను ముద్రించిందని విమర్శించారు.

March 3, 2026 / 02:51 PM IST

కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ

CTR: విజయపురం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయపురం మండలంలోని గాండ్ల కండ్రిగ గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రాజుతో కలిసి మండల పరిషత్ అధ్యక్షులు లక్ష్మీపతి రాజు గారు పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్నారు.

March 3, 2026 / 02:50 PM IST

ఇబ్రహీంపట్నం ఛైర్మన్ ఎన్నిక.. హైకోర్టు ఆదేశాలు

TG: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను రాబోయే మూడు వారాల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

March 3, 2026 / 02:49 PM IST

చౌటుప్పల్‌లో హోలీ సంబరాలు

BHNG: చౌటుప్పల్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. హోలీ ప్రేమ, సోదరభావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందనేది వేడుకల్లో స్పష్టం అవుతుంది.

March 3, 2026 / 02:49 PM IST

రోడ్డు ప్రమాద మృతుని వివరాల గుర్తింపు

KMR: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలను పోలీసులు మంగళవారం సేకరించారు. మృతుడు మండల కేంద్రానికి చెందిన గడ్డమీది చంద్రం (42)గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు వెల్లడించారు.

March 3, 2026 / 02:48 PM IST

పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే: రష్మిక

నటి రష్మిక మందన్న పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరలవుతున్నాయి. ‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ ఆ క్షణం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను. నా పిల్లలను ఎంతో సురక్షితంగా, జాగ్రత్తగా చూసుకోవాలి. వారి కోసం యుద్ధం చేయాల్సి వచ్చినా సిద్ధంగా ఉండేంత ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పిల్లల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

March 3, 2026 / 02:48 PM IST

హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే బాధితురాలు వీణ

అన్నమయ్య: రైల్వేకోడూరు జనసేన MLA అరవ శ్రీధర్ బాధితురాలు వీణ హైకోర్టును ఆశ్రయించారు. MLA తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనను మోసం చేశారని, పైగా తనపై తప్పుడు కేసులు పెట్టించారని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే తల్లితో ఫిర్యాదు చేయించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఎమ్మెల్యే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. వీణపై నమోదైన కేసు చెల్లదని పేర్కొంది.

March 3, 2026 / 02:47 PM IST