PDPL: రామగుండం రైల్వేస్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. అమృత్ భారత్ కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన వివిధ పనులు 100 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ భవనం ఆధునీకరణ, బుకింగ్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఆధునిక టాయిలెట్ బ్లాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు, ర్యాంపు, ఎస్కలేటర్లు, ఏటీఎం, రిటైనింగ్ రూమ్‌లను నిర్మిస్తున్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో ఈరోజు కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ.శేఖర్, కోశాధికారిగా ఎం.సాయిలు, సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఎన్నికయ్యారు.
T20 WC 2026 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన తీరుపై ఆ దేశ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘాకు కెప్టెన్సీపై అవగాహన లేకపోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. బౌలర్లను అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మండిపడ్డాడు. ఒకవేళ ఈ కెప్టెన్‌కు వసీం అక్రమ్, అక్తర్ వంటి దిగ్గజాలను ఇచ్చినా సరే మ్యాచ్‌ను ఓడించేస్తాడని వ్యాఖ్యానించాడు.
KKD: పెద్దాపురం పట్టణంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్వచ్ఛ సంకల్పాన్ని పటిష్ఠంగా అమలు చేస్తూ, వీధులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ELR: చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాల్లో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని మద్యం నిల్వలను పరిశీలించారు. అలాగే బాటిల్లను స్కాన్ చేసి వాటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మద్యాన్ని విక్రయించాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మంగళవారం ఆలయం మూసివేసిన వరకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,34,140, కార్ పార్కింగ్ రూ.1,75,000, VIP దర్శనాలతో రూ.1,35,000, ప్రధాన బుకింగ్ రూ.43 వేలు, బ్రేక్ దర్శనాలు రూ.42 వేలు, వ్రతాలు రూ.21 వేలు, తదితర విభాగాల నుంచి రూ.8,55,560 ఆదాయం వచ్చింది.
VSP: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడాపోటీలను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మంగళవారం ప్రారంభించారు. విశాఖ రైల్వే గ్రౌండ్‌లో జరుగుతున్న రెండు రోజుల ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో పలు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు.
NLG: చిట్యాల మండలం ఏపూరుకు చెందిన మాధగోని వంశీ (23) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లో మెకానిక్‌గా పనిచేసే వంశీ గ్రామానికి వచ్చిన సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం HYD లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీని ఆదుకోవాలని, దాతలు ఆర్థిక సాయం చేయాలని మిత్రులు విజ్ఞప్తి చేశారు.
E.G: రాజమండ్రి మెయిన్ రోడ్డులోని చిన్న మసీదులో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల రక్షణ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ASR: అన్నవరం పరిధిలోని లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద పోలీసులు భారీగా హాషీష్ ఆయిల్ పట్టుకున్నారు. సుమారు 11.5 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం వినోద్ బాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
BDK: చండ్రుగొండ మండలం, రవికంపాడు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలి సోయం రాములుని గూడ్స్ రైలు మంగళవారం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.
JN: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో మంగళవారం పోలీసులు గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోని, ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్, చేరిపల్లి ప్రసాద్, మునిగేల రాజేష్, జాటోత్ రాజేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేటలో ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు శ్రీ సీతారామ సహిత శ్రీలక్ష్మి గణపతి, కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. 06న ఉత్సవ ఊరేగింపు, 07న సూర్యనమష్కారాలు, 08న ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
KDP: గండికోటలో జూలై 14, 2025న జరిగిన వైష్ణవి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విషయాన్ని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేశ్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలపై కోర్టు ఉత్తర్వులతో గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.