AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వీరశ్రీనివాస్(48) మృతి చెందాడు. మృతుడు సామర్లకోట కుమ్మరివీధికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కి చేరింది.
BDK: సుజాతనగర్ మండలం వేపలగడ్డ మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్ని బుధవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని వంటశాల, విద్యార్థుల తరగతి గదులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు.
TPT: పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. 10వ తరగతి పాసైన వారు, చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్వీ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 4 వరకు ఉందన్నారు. OC/BC అభ్యర్థులకు రూ.400, SC/SC వారికి రూ. 100 వరకు ఫీజు చెల్లించాలన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇచ్చారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి కరాటే, తైక్వాండో వంటి అంశాల్లో ప్రాథమిక శిక్షణ అందించారు.
KNR: జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులు, న్యాయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. పరస్పర స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు, చిన్నారులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.
W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా పాలకొల్లు డీఎన్ఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో ఉమా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐలు రజని కుమార్, శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆధునిక యుగంలో విద్యార్థినులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సేఫ్టీ పట్ల మెలకువగా ఉండాలని హెచ్చరించారు.
కోనసీమ: జాతీయ సైన్స్ డే వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆన్ లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. డీఈవో పి. నాగేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఇందులో 262 ప్రభుత్వ, 108 ప్రైవేట్ పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 6న 30 పాఠశాలలకు రెండో రౌండ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.
ASF: బెజ్జుర్ మండలం సలుగుపెల్లి X రోడ్డు వద్ద SI సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో బుధవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ సూచించారు.
VSP: జూ పార్క్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. మధురవాడ వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి బొలెరో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆరిలోవ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలిక ఉన్నత పాఠశాలలో టీడీపీ సీనియర్ నేత కోదండరామిరెడ్డి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఎమ్మార్వో వెంకటేశ్వర్లు, ఎంఈవో దిలీప్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని పరీక్ష సామాగ్రిని అందజేశారు. పాఠశాలలో ఉన్న 151 మంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
AKP: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ బాధ్యతలు దక్కడంపై మాడుగుల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
SRD: యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలనీ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. బుధవారం సహచర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి సింగూర్ డామ్ పై సమీక్షించారు. సింగూరు ప్రాజెక్టు సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేసి జులై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించాలన్నారు.
HNK: టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్ మెన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజినీర్ పి.మధుసూదన్ రావు అమరవీరుల స్తూపం వద్ద శాఖాధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజినీర్లు ఏ.విజయేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్ తదితర అధికారులు పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన కొర్వి సాయిలు తీవ్ర అనారోగ్యంతో శస్త్రచికిత్స అవసరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బుధవారం MLA మదన్ మోహన్ వెంటనే స్పందించారు. ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా రూ. 2,50,000 లక్షల LOC మంజూరు చేయించారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేకు సాయిలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
AP: లడ్డూ నెయ్యిలో జంతుకొవ్వు ఉందని NDDB నివేదికలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ‘జగన్‌కు శ్రీవారంటే నమ్మకం లేదు.. సభలో రాజకీయం చేయొద్దు. లడ్డూ నెెయ్యి కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు. 2019-24 మధ్య లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించాలి. సభను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోంది. సంబంధం లేని కంపెనీ పేర్లు ప్రస్తావించడం సరికాదు’ అని పేర్కొన్నారు.