• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలి: ఈటల

TG: భూదాన్ బాధితులకు అండగా ఉంటామని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా కల్పించారు. మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తామంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మధురిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలంటూ సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 27, 2026 / 10:38 AM IST

బుసయ్యగారి పల్లిలో ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’

సత్యసాయి: సోమందేపల్లి మండలం బుసయ్యగారి పల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

February 27, 2026 / 10:38 AM IST

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంత సిద్ధం!

హీరో అల్లు శిరీష్‌ వివాహ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 6న నయనికతో ఆయన ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో అత్యంత గ్రాండ్‌గా ‘ప్రీ వెడ్డింగ్‌’ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుక ఏర్పాట్లను శిరీష్ స్వయంగా వెల్లడించాడు.

February 27, 2026 / 10:36 AM IST

వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

AP: ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా పదేపదే అడ్డుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు భయపడుతున్నారని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

February 27, 2026 / 10:36 AM IST

వినుకొండలో బార్ అండ్ రెస్టారెంట్‌పై ఆందోళన

PLD: వినుకొండలో మహిళలు ఆందోళన చేపట్టారు. వెల్లటూరు రోడ్డులో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. గురుకుల పాఠశాల సమీపంలో దీనికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ధర్నాతో వినుకొండ-వెల్లటూరు రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

February 27, 2026 / 10:36 AM IST

బ్యాంకులు రైతులకు తోడ్పాటు అందించాలి: ఎమ్మెల్యే

BHPL: నియోజకవర్గంలో నిర్వహించిన డీఎల్ఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ బ్యాంకుల పనితీరుపై స్పందించారు. పాత రుణాలు పూర్తిగా చెల్లించిన రైతులకు తిరిగి రుణాల మంజూరు, రెన్యువల్ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని సూచించారు. ప్రాధాన్యతా రంగాలకు రుణాల విడుదలలో చురుకుదనం చూపించాలని, ప్రభుత్వ పథకాల అమలుకు బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

February 27, 2026 / 10:35 AM IST

ఎస్పీ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహణ

నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఏఆర్ పోలీసులు, హోమ్ గార్డులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, వారాంతపు సెలవులు, పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ రియాజ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

February 27, 2026 / 10:35 AM IST

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంగ్లీష్ పరీక్ష

PDPL: ధర్మారం పట్టణంలో ఇవాళ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో కలిపి మొత్తం 539 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స సౌకర్యం కల్పించారు.

February 27, 2026 / 10:34 AM IST

ఉత్తరాంధ్రకు వెన్నెముక సుజల స్రవంతి

AKP: ఉత్తరాంధ్రకు వెన్నెముక అయిన సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తిచేస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కనీసం ఫస్ట్ ఫేజ్ అయినా పూర్తి చేయగలిగితే 1.30 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయవచ్చునని అన్నారు. సాగునీటి సౌకర్యం లేక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

February 27, 2026 / 10:34 AM IST

ప్రేమ వివాహం.. యువకుడి దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని బొమ్మలరామారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే యువకుడిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేశారు. మూడు రోజుల ముందు అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మాట్లాడాలని పిలిచి అజయ్‌పై యువతి సోదరుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి 14 సార్లు పొడిచాడు. దీంతో అతని పరిస్థితి విషయంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

February 27, 2026 / 10:34 AM IST

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు

SDPT: మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామ శివారు బంజరలో పలు అభివృద్ధి పనులకు సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ గురువారం శంకుస్థాపనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో జడ్పీ నిధుల నుంచి సీసీ రోడ్డు వేస్తున్నట్లు తెలిపారు. బంజర గ్రామంలో మండల పరిషత్ నిధుల నుంచి అండర్ డ్రైనేజీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 10:33 AM IST

‘నీటి సమస్య పరిష్కారానికి చర్యలు’

MNCL: వేసవికాలంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా పాడైన బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నామని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ రాజు తెలిపారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీలలో పనిచేయని బోర్లను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్మికులు, బోరు మెకానిక్‌లతో బోర్లను బాగు చేయించారు. వార్డులో సమస్యలు ఉంటే తనకు తెలపాలని, వాటిని పరిష్కరిస్తానన్నారు.

February 27, 2026 / 10:32 AM IST

టీ20 వరల్డ్‌కప్‌లో అర్ష్‌దీప్ నయా రికార్డ్

భారత స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 33 వికెట్లు సాధించిన భారత బౌలర్ బుమ్రా రికార్డును, 35 వికెట్లతో అధిగమించి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 19 మ్యాచ్‌లలోనే అర్ష‌దీప్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అర్షదీప్ క్రియేట్ చేయగా… అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు.

February 27, 2026 / 10:32 AM IST

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండాచూడాలి: కలెక్టర్

MDK: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, అందుబాటులో ఉండాలన్నారు.

February 27, 2026 / 10:32 AM IST

‘అసాంఘిక కార్యక్రమాలు చేస్తే చర్యలు తప్పవు’

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో దందాలు జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.కోవూరు నియోజవర్గంలో ఎలాంటి దండాలు జరగకూడదని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చేయమన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఏ పార్టీ వారైనా తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 10:31 AM IST