• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కళ్యాణదుర్గం–బొమ్మగానిపల్లి రోడ్డుకు ఎమ్మెల్యే భూమిపూజ

ATP: కళ్యాణదుర్గం నుంచి బొమ్మగానిపల్లి వరకు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తారు రోడ్డు పనులకు ఎమ్మెల్యే సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు వేస్తోందని ఆయన అన్నారు. 143 చెరువులకు నీరు, రిజర్వాయర్ల సాధనపై మార్చి 4న సీఎంను కలుస్తామని తెలిపారు.

February 28, 2026 / 12:10 PM IST

అందుబాటులోకి జైశ్రీరామ్ పేరు గల ఇటుకలు

BDK: భద్రాచలం రామాలయంలో తయారవుతున్న జైశ్రీరామ్ పేరు గల ఇటుకలను ఆదివారం నుంచి విక్రయించనున్నారు. ఇంటి నిర్మాణంలో తొలి ఇటుకగా వాడితే శుభం కలుగుతుంది. ఒక్కో ఇటుక ధర రూ. 60 ఉంటుందని అంచనా. ఇసుక, మట్టి, సిమెంట్ మిశ్రమంతో ఇవి తయారవుతున్నాయి. ఒక్కోటి సుమారు 2 కిలోల బరువు ఉంటుంది. ఈ ఇటుకలను చిత్రకూట మండపం సమీపంలో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.

February 28, 2026 / 12:10 PM IST

చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

February 28, 2026 / 12:10 PM IST

‘మహితాపూర్‌లో ఎడ్యుకేషన్ సొసైటీ మోసం’

JGL: రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో కుట్టు మెషీన్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరితో రూ. వెయ్యి వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘ఐ క్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ పేరుతో రశీదులు ఇస్తూ 100 రోజుల్లో మెషీన్ అందజేస్తామని, లేకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

February 28, 2026 / 12:10 PM IST

1,200 మందికి 2BHK ఇళ్ల పట్టాలు అందజేత

RR: షాద్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టాలు పంపిణీ చేశారు. తొలివిడతగా లబ్ధిదారులకు 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. 28 వార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.

February 28, 2026 / 12:09 PM IST

పారిశుద్ధ్యం పై దృష్టి సారించిన కౌన్సిలర్

KMM: మధిర మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు శనివారం వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల వెంబడి పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలు, డ్రైనేజీ మట్టి దిబ్బలు జేసీబీతో గత రెండురోజులుగా తొలగిస్తున్నారు. రజకబజారు వీధిలో రోడ్ పక్కన దట్టంగా పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్యం చేపట్టారు.

February 28, 2026 / 12:08 PM IST

HPV వ్యాక్సినేషన్‌కు పటిష్ట కార్యాచరణ: జిల్లా కలెక్టర్

KMM: జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

February 28, 2026 / 12:08 PM IST

ఎంపీ ఈటెల రాజేందర్‌ను కలిసిన బీజేపీ నాయకులు

WNP: బీజేపీ పార్టీ ఎంపీ రాష్ట్ర చేరికల కమిటీ  ఛైర్మన్ ఈటల రాజేందర్‌ను వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా జిల్లా నాయకులు కలిశారు. అనంతరం పార్టీ గురించి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.

February 28, 2026 / 12:06 PM IST

ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేసిన మండల విద్యాధికారి ‌

SRPT: పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం వంటి కనీస సామర్ధ్యాలతోపాటు గణితంలో చతుర్వధ ప్రక్రియపై పట్టు సాధించిన ఉపాధ్యాయులు కృషి చేయాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సూచించారు. శనివారం కోదాడ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు పరిశీలించారు.

February 28, 2026 / 12:06 PM IST

పాఠశాల విద్యాభివృద్ధికి దాతల సహకారం

SRD: కంగ్టి మండలం తుర్కవడ్గం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విద్యాసామాగ్రిని పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కిషన్ పవార్ తెలిపారు. పాఠశాల, విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా దాత రేణీ గ్రేస్, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్యకు పాఠశాల బృందం తరపున HM కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

February 28, 2026 / 12:06 PM IST

మెగాస్టార్ మూవీలో బండ్ల గణేష్..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో వస్తున్న ‘మెగా-158’ చిత్రంపై అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్. చిరు వీరాభిమాని అయిన బండ్లన్న ఎంట్రీతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పాత్ర ఫన్నీగా ఉంటుందా లేదా పవర్‌ఫుల్‌గా ఉంటుందా అన్నది సస్పెన్స్ అయినప్పటికీ, బండ్లన్న మార్క్ డైలాగులు పక్కా అని తెలుస్తోంది.

February 28, 2026 / 12:06 PM IST

గట్టు ఏపీఎంగా మారుతి బాధ్యతలు

GDWL: గట్టు మండల నూతన ఏపీఎంగా మారుతి బాధ్యతలు స్వీకరించారు. మండల సమాఖ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, సీసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మారుతి హామీ ఇచ్చారు.

February 28, 2026 / 12:05 PM IST

లింగంపేట ఎంఈవోగా అంజల్రెడ్డి బాధ్యతల స్వీకరణ

KMR: లింగంపేట మండల విద్యాధికారిగా వంచ అంజల్ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఆయన, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఇప్పటివరకు లింగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న గోపాల్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

February 28, 2026 / 12:05 PM IST

హెచ్‌పీవీ వ్యాక్సిన్.. ప్రారంభోత్సవానికి సీఎం హాజరు

AP: విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14, 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాల కేంద్ర ఆరోగ్యశాఖ ఇస్తున్న విషయం తెలిసిందే.

February 28, 2026 / 12:03 PM IST

60 ఏళ్ల స్నేహం MLA కంటతడి..!

KDP: రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.

February 28, 2026 / 12:03 PM IST